తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో 14 విజయాల తర్వాత జరిగిన 2023 ఎన్నికల్లో ఓడిపోయారు. కామారెడ్డి, గజ్వేల్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన కేసీఆర్, కామారెడ్డి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కె.వెంకటరమణారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో 14 విజయాల తర్వాత జరిగిన 2023 ఎన్నికల్లో ఓడిపోయారు.
కామారెడ్డి, గజ్వేల్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన కేసీఆర్, కామారెడ్డి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కె.వెంకటరమణారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అదేవిధంగా 1989, 1994, 1999లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 1999 ఎన్నికల్లో గెలిచి తెలంగాణ కోసం ఉద్యమించిన కేసీఆర్ 2001లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించారు. 2001లో సిద్దిపేట ఉప ఎన్నికల్లో ఐదోసారి ఎమ్మెల్యేగా పోటీ చేశారు.
2004లో సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా, కరీంనగర్ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. లోక్సభలో తెలంగాణ తరపున తన వాణి వినిపించేందుకు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ కోరుతూ 2006, 2008లో కరీంనగర్ లోక్ సభ స్థానానికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు.