అసలు కాంగ్రెస్ జెండా కనిపిస్తుందా? అని కార్యకర్తలు నిరాశ చెందారు. కానీ అడుగున్న కాంగ్రెస్ పార్టీని తన భుజాలపై వేసుకొని.. అసంతృప్తిని.. అడ్డంకులను ఎదుర్కొని మరోసారి ఆ పార్టీ జెండా రెపరెపలాడడానికి కారణమైన వ్యక్తి ఎవరో మీకిప్పటికే అర్థమై ఉంటుంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా రేవంత్ రెడ్డి ముందకు సాగారు. అయినా కొన్ని సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్లు రేవంత్ రెడ్డి తప్పులు ఎక్కడ దొరుకుతాయా? అని ఎదురుచూస్తుంటారని కొందరు అంటుంటారు.
ఈ క్రమంలో అధికారం చేపట్టబోయే కాంగ్రెస్ కు రేవంత్ రెడ్డి ముందుగా సీనియర్లనుఅదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీలో ఎలాంటి అసంతృప్తులు లేకుండా ఉండడంతోనే ప్రభుత్వ మనుగడకు ఎలాంటి అడ్డంకులు ఏర్పడవని అంటున్నారు. మరోవైపు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి, పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ను కాదని రేవంత్ రెడ్డికి ప్రజలు అవకాశం ఇచ్చారు.
దీంతో పార్టీ ప్రకటించి ఆరు గ్యారెంటీల పథకాలతో పాటు అభివృద్ధిని కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఈ విషయాల్లో ఎక్కడ తేడా కొట్టినా ప్రజలు తిరగబడే ప్రమాదం ఉంది. ఎందుకంటే రైతు బంధు, పింఛన్ లాంటి రెగ్యులర్ పథకాలు పొందిన వారు సైతం కాంగ్రెస్ కు అవకాశం ఇస్తే ఎలా చేస్తుందోనని ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డికి రెండు వైపులా పదునైన కత్తి లాగే ప్రభుత్వం నడపడం అని చర్చించుకుంటున్నారు.