మహేష్ ఈ ఈవెంట్ కి చాలా సింపుల్ గా వచ్చారు. ఆయన స్కై బ్లూ కలర్ స్లిమ్ ఫిట్ టీ షర్ట్ లో ఆకట్టుకున్నారు. అభిమానులు మహేష్ ధరించిన ఆ టీ షర్ట్ ని గమనించారు. అలాగే దాని ధర, వివరాలు సేకరించారు. సాధారణంగా కనిపిస్తున్న ఆ టీ షర్ట్ ధర మాత్రం మైండ్ బ్లాక్ చేసేలా ఉంది. అయితే అభిమానులు మహేష్ ధరించి టీ షర్ట్ వివరాలు సేకరించారు. ఇంటర్నేషనల్ బ్రాండ్ గివెంచి కి చెందిన ఆ స్లిమ్ ఫిట్ టీ షర్ట్ ధర ఏకంగా రూ. 47 వేలు రూపాయలట. ఏంటీ ఒక్క టీ షర్ట్ అన్ని వేలా అని ఆశ్చర్యపోవడం అందరి వంతు అయ్యింది.
మహేష్ రేంజ్ కి ఈ అమౌంట్ చాలా తక్కువ. సామాన్యులకు మాత్రం చాలా ఎక్కువ. ఆ డబ్బుతో ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఏడాదికి సరిపడా బట్టలు కొనుక్కోవచ్చు. ఇక యానిమల్ ప్రీ రిలీజ్ వేడుకలో మహేష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బాలీవుడ్ స్టార్స్ రన్బీర్, అనిల్ కపూర్ మహేష్ ని పొగడ్తలతో ముంచెత్తారు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన యానిమల్ మూవీ డిసెంబర్ 1న విడుదల కానుంది. యానిమల్ ప్రీ రిలీజ్ వేడుకకు రాజమౌళి సైతం హాజరయ్యారు. తన సపోర్ట్ అందించారు. యానిమల్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.

మరోవైపు మహేష్ గుంటూరు కారం షూటింగ్ లో బిజీగా ఉన్నారు. దర్శకుడు త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సంక్రాంతి కానుకగా 2024 జనవరి 12న గుంటూరు కారం విడుదల కానుంది. ఈ మూవీలో మహేష్ కి జంటగా శ్రీలీల నటిస్తుంది. మీనాక్షి చౌదరి మరొక హీరోయిన్. వచ్చే ఏడాది రాజమౌళి మూవీ సైతం సెట్స్ పైకి వెళ్లనుంది. స్క్రిప్ట్ పూర్తి చేసే పనుల్లో రాజమౌళి నిమగ్నమై ఉన్నారు. రెండు భాగాలుగా విడుదల కానుందనే ప్రచారం జరుగుతుంది.
