వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి సుమారు ఆరు సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. చాలాసార్లు వీరి ప్రేమ వ్యవహారంపై రూమర్లు వచ్చినా ఇద్దరూ సైలెంట్‍గానే ఉండేవారు. అయితే, ఈ ఏడాది జూన్‍లో వరుణ్, లావణ్య ఎంగేజ్‍మెంట్ జరిగింది.
ఇక, నవంబర్ 1వ తేదీన ఇటలీలోని టస్కానీలో పెళ్లితో ఒక్కటయ్యారు. గతంలో మిస్టర్, అంతరిక్షం చిత్రాల్లో హీరోహీరోయిన్లుగా వరుణ్, లావణ్య నటించారు.ఇక పెళ్లి కోసం, వరుణ్ తేజ్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన క్రీమ్-గోల్డ్ షేర్వాణిని ధరించాడు. లావణ్య కూడా మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన కాంచీపురం చీరను ధరించింది.
అశ్విన్ మావ్లే, హసన్ ఖాన్ ఈ జంటకు స్టైలింగ్ చేసారు. ఇక ఈ పెళ్లి వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్, వైష్ణవ్ తేజ్, నితిన్ హాజరయ్యారు. .