తెర మీద చూసేటప్పుడు మాంచి ఫీల్ కలిగించే ముద్దు సన్నివేశాల్ని కెమేరా ముందు నటించే సమయంలో ఎదురయ్యే కష్టాలు అన్ని ఇన్ని కావని చెబుతారు బాలీవుడ్ ముద్దుగుమ్మ రిచా చద్దా. ఈ మధ్యనే విడుదలై.. మాంచి పేరును సొంతం చేసుకున్న పంగా చిత్రంలో ఆమె ముద్దు సీన్ చేశారు. దీనిపై ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఒక ప్రముఖ మీడియాతో మాట్లాడిన ఆమె.. ముద్దు సీన్ చేసేటప్పుడు పడే ఇబ్బంది అంతా ఇంతా కాదని.. రొమాంటిక్ సన్నివేశాల్ని చిత్రీకరించే సమయంలో ఇబ్బందితో పాటు.. భయం కూడా ఎక్కువేనని చెప్పారు. తాజాగా తాను నటించిన ముద్దు సీన్ షూట్ చేసే సమయంలో తన కో స్టార్ నుదర్శకుడు పిలిచి..
రిచా విగ్గు కెమేరాలో ఇబ్బంది పెడుతోంది.. నువ్వు సరి చేయమని చెప్పాడని చెప్పింది. ముద్దు సీన్ చేసేటప్పుడు సీన్ లో లీనమైనట్లు కనిపించినా.. అదంతా నిజం కాదని.. దర్శకుడు ఏం చెబితే అది చేయటమే తప్పించి.. వాస్తవంగా చేయటం సాధ్యం కాదని చెప్పింది. ముద్దు సీన్ చేయటం చాలా ఇబ్బందే కాదు.. భయాన్ని కూడా కలిగిస్తుందని కష్టాల్ని ఏకరువు పెట్టుకొచ్చింది.