కర్నె శిరీష అందమైన పేరు. జీవితం ఆమెని బర్రెలక్కని చేసింది. ఇష్ట సమాజం ఆమెకు అదే పేరు ఖరారు చేసింది. ఈ మాలపిల్ల నాగర్ కర్నూలు జిల్లాలోని రెడ్డి, రావు దొరల నియోజకవర్గమైన కొల్లాపూర్లో అన్రిజర్వ్డ్ యుద్ధం చేస్తున్నది. తెలంగాణలో ఇప్పుడు అత్యంత బాధిత వర్గంగా మారిన నిరుద్యోగుల తరఫున గొంతుగా మారింది.
అయితే, ఈ ప్రలోభాలకు, బెదిరింపులకు, దాడులకు తాను భయపడబోనని బర్రెలక్క తేల్చి చెప్పింది. ప్రాణం పోయినా సరే పోరాటం ఆపబోనని స్పష్టం చేసింది. బర్రెలక్కపై దాడి జరగడంతో సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు, యూట్యూబర్లు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. బర్రెలక్కకు ఓటు వేసి గెలిపించాలని కొల్లాపూర్ నియోజకవర్గ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజాసంఘాల నేతలు, మేధావులు, ప్రజలు బర్రెలక్కకు అండగా నిలుస్తున్నారు.
స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆమె తరఫున ప్రచారం చేస్తున్నారు. దీంతో పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ కొల్లాపూర్ బరిలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో టెన్షన్ పెరుగుతోంది. నాగర్ కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.