పంజాబీ ముద్దుగుమ్మ, క్రేజీ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఆరేళ్లుగా ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉంటోంది. తెలుగు, తమిళంలో వరుస పెట్టి సినిమాలు చేస్తూ వచ్చింది. కానీ టాలీవుడ్ ఫిల్మ్ RX100 తప్పా పెద్దగా సక్సెస్ అందుకున్న సినిమాలు లేవు. అయితే ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది పాయల్ రాజ్ పుత్. తొలి చిత్రంలోనే పూర్తిగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి అదరగొట్టేసింది. ఈ సినిమాలో తన నటనతో అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంది. ఆ తర్వాత తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటూ బిజీ హీరోయిన్ అయిపోయింది.
ఆర్ఎక్స్ 100 సినిమా డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో మరోసారి ఈ ముద్దుగుమ్మ నటిస్తోన్న సినిమా మంగళవారం. ఈ మూవీ శుక్రవారం అంటే నవంబర్ 17న విడుదల కాబోతుంది. ఈ సినిమా ప్రమోషనల్లో భాగంగా హైదరాబాద్ విలేకర్ల సమావేశంలో ముచ్చటించింది. ఈ సందర్భంగా పాయల్ మాట్లాడుతూ.. సినీ ప్రయాణంలో ఎత్తు పల్లాలు చాలా ఉంటాయని.. ఉన్నట్లుండి తారాస్థాయికి చేరుకుంటామని.. ఆ వెంటనే కిందపడితామని.. ఈ అటు పోట్లు అనేవి నటీనటులకు చాలా బాధకు గురిచేస్తుంటాయని తెలిపింది పాయల్.
ఈ ఐదేళ్ల సినీ ప్రయాణంలో తెలుగు ప్రేక్షకులు చూపించిన ప్రేమ, అభిమానం వెలకట్టలేనిదని.. తొలి సినిమా ఆర్ఎక్స్ 100 చాలా పేరు తీసుకొచ్చిందని.. అందులో నెగిటివ్ రోల్ కావడంతో అదే కోణంలో చిత్రపరిశ్రమ తనను చూసిందని చెప్పుకొచ్చింది. ఈ ఐదేళ్ల సినీ ప్రయాణంలో తెలుగు ప్రేక్షకులు చూపించిన ప్రేమ, అభిమానం వెలకట్టలేనిదని.. తొలి సినిమా ఆర్ఎక్స్ 100 చాలా పేరు తీసుకొచ్చిందని.. అందులో నెగిటివ్ రోల్ కావడంతో అదే కోణంలో చిత్రపరిశ్రమ తనను చూసిందని చెప్పుకొచ్చింది.