కొందరు సమస్యలను చూసి పెద్దగా టెన్షన్ పడరు. వాటిని తేలికగా ఎదుర్కొని పరిష్కరిస్తారు. మరికొందరు భయాందోళనలకు గురవుతారు. కష్టాలను ఎదుర్కొనలేక తమను తాము అసమర్థులుగా అనుకుంటారు. అటువంటి వారు ఆచార్య చాణక్యుడు చెప్పిన ఐదు విషయాలను తప్పక తెలుసుకోవాలి. అయితే ఆచార్య చాణక్యుడు చాణక్య నీతిలో మానవ జీవితానికి ఎన్నో సలహాలు ఇచ్చాడు.
స్త్రీ పురుషులు సిగ్గు లేకుండా ఏ పనులు చేయాలో ఆయన చెప్పిన సలహాలలో ఉన్నాయి. డబ్బు సంపాదించడానికి సిగ్గుపడకండి. మంచి, సౌకర్యవంతమైన, సాఫీగా జీవించడానికి డబ్బు అవసరం. మన అవసరాలన్నీ డబ్బుకు సంబంధించినవే. కాబట్టి.. ఈ విషయంలో సిగ్గు, మొహమాటాలకు ఛాన్స్ ఇవ్వొద్దు. చాలా మంది డబ్బు లేదా అప్పుగా ఇచ్చిన వస్తువులను తిరిగి అడగడానికి చాలా సిగ్గుపడతారు.
అలా సిగ్గుపడకండి. మీ డబ్బు, వస్తువులను సకాలంలో క్లెయిమ్ చేయండి. మీ మొహమాటం మీకు సమస్యగా మారనివ్వకండి. మన జీవితం బాగుపడాలంటే అవసరం. కాబట్టి గురువులు లేదా టీచర్ల నుంచి విద్యను నేర్చుకోవడంలో సిగ్గుపడకండి. వారు చెప్పకపోతే.. అడిగి మరీ చెప్పించుకోవాల్సిందే. చాలామంది బహిరంగంగా తినడానికి సిగ్గుపడుతూ ఉంటారు. కానీ మనం చేసేదంతా ఆకలి కోసం, కడుపు నింపుకోవడం కోసమే కదా. కాబట్టి మీకు ఆకలిగా అనిపించినప్పుడు తినండి, దాని గురించి సిగ్గుపడకండి అని చాణక్యుడు తెలిపాడు.