ఎవరికి కనిపించకుండా దంపతులు చాటుగా సాగించే వ్యవహారమే శృంగారం. కానీ ఇటీవల కాలంలో దీన్ని కూడా బహిర్గతం చేస్తున్నారు. నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అంటూ కట్టుకున్న భార్యతో జరిపిన తొలి రాత్రి దృశ్యాలను ఓ ప్రబుద్ధుడు సామాజిక మాధ్యమాల్లో పెట్టాడు. మా అమ్మ, మా అన్నయ్య, మా అక్కయ్య అంటాం కానీ ఒక భార్యను మాత్రమే నా భార్య అని సంబోధిస్తాం. ఎందుకంటే జీవితంలో ఏ మహిళ అయినా ఒకరికే భార్య అవుతుంది. అతడితోనే జీవితం పంచుకుంటుంది. అతడికే సర్వం అర్పిస్తుంది. అలాంటి భార్య శీలానికే మచ్చ తెచ్చాడు. అయితే ఒక్కొక్కరికి ఒక్కో రకం పిచ్చి ఉంటుంది.
సోషల్ మీడియా రాకతో కొందరి పిచ్చి ఇటీవల పీక్స్‌కు వెళ్తోంది. చిత్రవిచిత్రమైన పనులు చేస్తూ.. ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. వీటిలో కొన్ని సందేశాత్మకంగా ఉండగా, మరికొన్ని షాక్ అయ్యేలా, ఇంకొన్ని నెటిజన్లకు ఆగ్రహం తెప్పించేలా ఉంటున్నాయి. ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. నవ దంపతులు తమ శోభనం వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో, వీళ్లకేమైన పిచ్చా అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో నవ దంపతులకు సంబంధించిన శోభనం వీడియో వైరల్‌గా మారింది. అందంగా అలంకరించబడిన శోభనం గదిలోకి నవ దంపతులు ప్రవేశిస్తారు. అయితే అనంతరం వీరికి విచిత్రమైన ఆలోచన వచ్చింది.
అంతే వెంటనే తమ మొబైల్ ఆన్ చేశారు. వరుడు వధువును ప్రేమగా దగ్గరికి తీసుకోవడం, ముద్దులు పెట్టుకోవడమే కాకుండా చివరకు దుస్తులు తీయడానికి సాయం చేసే ఘటనను కూడా మొబైల్లో రికార్డు చేస్తారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. వీళ్లకేమైనా పిచ్చా.. అంటూ కొందరు, శోభనం సన్నివేశాలను రికార్డు చేయడం ఏంటని మరికొందరు , ఇది మంచి పద్ధతి కాదంటూ ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో లక్షల్లో వ్యూస్‌ను సొంతం చేసుకుంది.