వరుణ్ తేజ్ పెళ్లికి చిరంజీవి ఖరీదైన గిఫ్ట్, చిరు ఏం ఇచ్చారో తెలుసా..?

ఇటలీ లోని టెస్కాన్ లో 120 మంది కుటుంబ సభ్యుల సమక్షంలో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి లు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇక వీరిద్దరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఒక్కొక్కటిగా సోషల్ మీడియాలో బయటపడుతున్నాయి. కాక్ టెయిల్ పార్టీ నుండి మొదలు మెహందీ, హల్దీ ఫంక్షన్లు గ్రాండ్ గా జరిగాయి. దానికి సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట్లో వైరల్ గా మారాయి. అలాగే వరుణ్ తేజ్ లావణ్యలు పెళ్లి బట్టల్లో ఉన్న ఫోటోలు కూడా మీడియాలో వైరల్ గా మారాయి.

ఇక మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ ఒకే దగ్గర కనిపించేసరికి అభిమానుల ఆనందానికి అవధులు లేవు. అయితే చిరంజీవి రెండుకోట్ల రూపాయలు విలువచేసే ఖరీదైన డైమండ్ సెట్ ను బహుమతిగా ఇచ్చారు. దీన్ని చూసి భార్యాభర్తలిద్దరూ ఉబ్బితబ్బిబ్బయ్యారు. తాను కూడా ఇటువంటి ఆనందాన్ని మీలో చూడాలనుకున్నానని చిరంజీవి అన్నారు. వరుణ్-లావణ్య.. ఇద్దరికీ కార్లు అంటే మహా పిచ్చి.

ఎప్పటికప్పుడు మార్కెట్ లోకి కొత్తగా వస్తున్న కార్లను కూడా వీరు టెస్ట్ డ్రైవ్ చేస్తుంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని పవన్ కల్యాణ్ వారికి ఓ కొత్తమోడల్ కారు కొన్నిచ్చారు. ఆ కారులో వరుణ్, లావణ్య ఇష్టాఇష్టాలకు అనుగుణంగా కొన్ని ఫీచర్లు రూపొందించి మరీ ఇచ్చాడు. చిరంజీవి, పవన్ కల్యాణ్ తమ సోదరుడు నాగబాబు పిల్లల్ని కూడా సొంత పిల్లలకంటే బాగా చూసుకుంటారని అభిమానులు గర్వంగా చెప్పుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *