చంద్రబాబుకు సంఘీభావం తెలుపుతూ ఉండడం విశేషం. మరోవైపు తెలుగు సినీ పరిశ్రమ నుంచి పలువురు ప్రముఖులు స్పందిస్తున్నారు. ఇప్పటికే దర్శకుడు రాఘవేంద్రరావు, నిర్మాత అశ్వినీదత్ స్పందించారు. తాజాగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సంఘీభావం తెలిపినట్లు తెలుస్తోంది. అయితే లోకేష్ కి జూనియర్ ఎన్టీఆర్ సాయం చేసినట్లు సరికొత్త వార్త సోషల్ మీడియాలో వినిపిస్తోంది.
మేటర్ లోకి వెళ్తే బుధవారం లోకేష్ కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో బేటి కావడం తెలిసిందే. ఈ భేటీలో పురందేశ్వరితో పాటు తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా ఉన్నారు. ఈ క్రమంలో చంద్రబాబు అరెస్టు చేసిన విధానాన్ని ఆయన ఆరోగ్య పరిస్థితులను లోకేష్… అమిత్ షా దృష్టికి తీసుకెళ్లడం జరిగిందట. అయితే అసలు ఈ అపాయింట్మెంట్ లోకేష్ కి దొరకటానికి ప్రధాన కారణం జూనియర్ ఎన్టీఆర్ అని సరికొత్త వార్త ఇప్పుడు వినిపిస్తోంది.
విషయంలోకి వెళ్తే గతంలో హైదరాబాద్ పర్యటనలో అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ కావడం జరిగింది. అయితే ఈ భేటీలో అనేక రాజకీయ విషయాలు కూడా మాట్లాడుకున్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అదంతా పక్కన పెడితే జైల్లో ఉన్న చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్.. అమిత్ షాతో మాట్లాడి లోకేష్ కి అపాయింట్మెంట్ ఇప్పించటం జరిగిందట. దీంతో ఎన్టీఆర్ దయతోనే లోకేష్.. అమిత్ షా నీ కలిసినట్లు టాక్ వినిపిస్తోంది.