అమ్మాయిలపై అఘాయిత్యాలు, అత్యాచారాలు, కల్తీ మద్యం, డ్రగ్స్, మద్యపాన నిషేధం గురించి.. ఆడవాళ్ల గురించి ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడేందుకు తాను సిద్దమని.. రోజా సిద్దంగా ఉందా? అని సవాలు విసిరారు. పార్టీలను పక్కనబెట్టి ఆడవాళ్లుగా మాట్లాడుదామని అన్నారు. ప్రతి పక్షంలో ఉన్నపుడు రోజా మద్యం బాటిల్స్ బద్దలు కొట్టారని… ఇపుడు మద్యం ఏరులై పారుతున్న ఎందుకు స్పందించడం లేదని వంగలపూడి అనిత ప్రశ్నించారు. అయితే ప్రజా సమస్యల మీద స్పందించడానికి వెళ్తుండగా మీరు ఎలా అడ్డుకుంటారు.
కలెక్టర్ ను కలవడానికి వెళ్తుంటే మీరు అడ్డుకోవడం ఏంటి? నేనే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా.. ప్లీజ్.. నేను ఎస్పీ గారికి ఫోన్ చేశాను.. అన్నా కూడా పోలీసులు వినరు. చివరకు గేటు దూకి వచ్చిన పోలీసులు ఆమెను గృహ నిర్బంధం చేశారు. నా చుట్టూ ఎందుకు ఇంత మంది పోలీసులు అంటూ ఆమె ప్రశ్నించారు. దీంతో తనకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసులను నేను తీసుకోను అంటూ ఆ నోటీసు అక్కడే పెడుతుంది. నా నియోజకవర్గంలో స్పందన ప్రోగ్రామ్ కు వెళ్తుండగా మీరు నన్ను ఎలా అడ్డుకుంటారు. ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసమే కదా నేను వెళ్లేది.. కలెక్టర్ మీకు చెప్పారా? ఏంటి అసలు అంటూ పోలీసులపై తీవ్రస్థాయిలో మాట్లాడారు వంగలపూడి అనిత. చిన్నపిల్లలు వాళ్లు.
వాళ్లకు ఏం జరిగినా పట్టించుకోరా? అంటూ అనిత చెప్పడంతో మీరు వినకపోతే అరెస్ట్ చేయాల్సి ఉంటుంది అంటారు పోలీసులు. అయినా కూడా అనిత వినదు. పోలీసులతో వాగ్వాదం చేస్తుంది. నేను స్పందనకే వెళ్తున్నా. స్పందన నుంచి నేను ఎక్కడా ధర్నాలు చేయను. ప్రజా సమస్యల మీద కలెక్టర్ కు ఫిర్యాదు చేయడానికి వెళ్తుంటే నన్ను అడ్డుకుంటున్నారు. ప్లీజ్ దయచేసి నన్ను వెళ్లనివ్వండి.. చాలా సమస్యలు ఉన్నాయి. మీకు దండం పెడతా.. అంటూ అనిత వేడుకున్నారు.