కదులుతున్న రైలులో డ్యాన్స్‌తో దుమ్ముడులిపిన అమ్మాయి, ఈ వీడియో మీకోసమే.

సామాజిక మాధ్యమాల ద్వారా గుర్తింపు తెచ్చుకోవాలని ఎంతో మంది ఊవిళ్లూరుతున్నారు. అందుకోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ వంటి షార్ట్ వీడియో ఫార్మాట్‌లకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఓ కొత్త ట్రెండ్ ఉద్భవించింది. బహిరంగ ప్రదేశాల్లో, రైళ్లు, బస్సులు, మెట్రోల్లో డ్యాన్స్ చేస్తూ వీడియో తీసుకోవడం, దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఇటీవలి కాలంలో చాలా ఎక్కువైంది.

ఎన్ని విమర్శలు వస్తున్నా యువత మాత్రం వెనక్కి తగ్గడం లేదు. కదులుతున్న రైలులో ఒక అమ్మాయి డ్యాన్స్ చేస్తున్న మరో వీడియో వైరల్ అవుతోంది. రైల్లో యువతి చేసిన డ్యాన్స్ నెటిజన్లు బాగా ఆకట్టుకుంటోంది. కానీ, సోషల్ మీడియా ట్రెండ్‌ కోసం రైళ్లలో పెరుగుతున్న ఇలాంటి సంఘటనలపై నెటిజన్లు ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కదులుతున్న రైలులో ఒక అమ్మాయి డ్యాన్స్ చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోను ‘taara_celeb’ అనే వినియోగదారు తమ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేశారు.

“ట్రైన్ మి సఫర్ ఔర్ యే పాట” అనే శీర్షికతో ఉన్న వీడియో సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్.. చయ్య చయ్య సాంగ్‌. ఆ పాటకు యువతి తన డ్యాన్స్‌తో ప్రతాపం చూపించింది. కానీ, ప్రయాణికులు, నెటిజన్లకు కోపం వచ్చింది మాత్రం ఇదంతా రైల్లో చేసినందుకు. ప్రజల ప్రశాంతత, మనోభావాలను దెబ్బతీసేలా, వారికి ఇబ్బందులు కలిగించేలా ఇలా బహిరంగ ప్రదేశాల్లో రీల్స్‌ చేయటం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *