పోలీస్‌ను నడిరోడ్డుపై చెప్పుతో కొట్టిన మహిళ, అసలు ఏం జరిగిందో చుడండి.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథురలో అక్టోబర్ 2 వ తేదీన ఓ మహిళ ఆటోలో తన ఇంటికి వెళ్తోంది. అయితే పానిగావ్ లింక్ రోడ్ నుంచి కైల్సా నగర్‌కు వచ్చే మలుపు వద్ద మహిళ వెళ్తున్న ఆటోను పోలీస్ అధికారి అడ్డుకున్నాడు. అయితే ఆ సమయంలో ఆటోలో ఉన్న ఆ మహిళను ఆ పోలీస్ కిందికి దించాడు. అనంతరం ఆమె పట్ల ఆ పోలీస్ అసభ్యంగా ప్రవర్తించాడు. అయితే నడి రోడ్డుపై పోలీస్‌ను చితకబాదింది.

ఈ సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. కొద్దిరోజుల క్రితం ఉత్తర ప్రదేశ్‌లోని మధురకు చెందిన ఓ యువతి ఆటోలో ప్రయాణిస్తూ ఉంది. జంక్షన్‌ దగ్గర ఓ పోలీస్‌ అధికారి ఆ ఆటోను ఆపాడు. అనంతరం ఆటోలో ఉన్న మహిళతో తప్పుగా ప్రవర్తించటం మొదలుపెట్టాడు. దీంతో మహిళ పోలీస్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. అతడిపై ఎదురు తిరిగింది. మహిళ ఎదురు తిరగటంతో పోలీస్‌కు కోపం వచ్చింది. ఆమెను కొట్టడం మొదలుపెట్టాడు. పోలీస్‌ కొట్టడంతో ఆమెకు కోపం వచ్చింది. వెంటనే ఆయనపై దాడికి దిగింది.

చెప్పు తీసి పోలీస్‌ను కొట్టడం మొదలుపెట్టింది. పోలీస్‌ ఒక దెబ్బ వేస్తే.. ఆమె రెండు దెబ్బలు వేయటం మొదలుపెట్టింది. పక్కనే ఉన్న మరో పోలీస్‌.. ఆ గొడవ పడుతున్న పోలీస్‌ను ఆపే ప్రయత్నం చేయసాగాడు. అయినా ఆ పోలీస్‌ మహిళ మీద మీదకు వెళ్లసాగాడు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *