పవిత్ర కు హ్యాండ్ ఇచ్చిన నరేష్, ఇప్పుడిదే హాట్ టాపిక్.

ఈ పెళ్లి రియల్ కాదని నరేష్ క్లారిటీ ఇచ్చారు. ఓ సినిమా ప్రెస్ మీట్ లో పాల్గొన్న ఆయనను మీడియా ప్రతినిధులు మీరు పవిత్రను పెళ్లి చేసుకున్నారా అని అడిగిన ప్రశ్నకు నరేష్ సమాధానం దేటేసే ప్రయత్నం చేశారు. అయినా వదలని విలేకరులు ప్రభాస్‌, సల్మాన్‌ ఖాన్‌ల పెళ్లి కంటే మీ పెళ్లి ప్రస్తుతం హాట్‌ టాపిక్‌ అయిందని అడిగారు. అయితే ప్రతి పది జంటల్లో 8 మంది విడిపోతున్నారు. మనల్ని ప్రేమించే, అభిమానించే, నమ్మదగిన వ్యక్తి తోడు ఉంటే చాలని చెప్పారు. ఇక వీరిద్దరి ఎపిసోడ్లో కి నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి రావడం రచ్చయింది.

నరేష్, పవిత్ర మైసూర్ హోటల్ లో ఉన్నారన్న విషయం తెలుసుకొని రమ్య అక్కడకు వెళ్లారు. రమ్య, పవిత్ర లోకేష్, నరేష్ మధ్య హైడ్రామా నడిచింది. రమ్య వారిద్దరినీ దూషిస్తూ చెప్పుతో దాడి చేయబోయింది. పోలీసులు నరేష్, పవిత్రలను అక్కడి నుండి తరలించేశారు. నాకు విడాకులు ఇవ్వకుండా నరేష్ మరో వివాహం ఎలా చేసుకుంటాడని రమ్య ఆరోపించారు. ఆ వివాదం అలానే ఉంది. అయితే రమ్య రఘుపతి సైలెంట్ కావడంతో గొడవ సద్దుమణిగింది. కాగా తాజాగా మరో వార్త తెరపైకి వచ్చింది. పవిత్రను కూడా వదిలేసిన నరేష్ మరో మహిళకు దగ్గరయ్యాడట. నరేష్ కి ఆయన గుడ్ బై చెప్పేశాడనేది లేటెస్ట్ టాక్. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రముఖంగా ప్రచారం అవుతుంది.

ఇక నరేష్ వ్యక్తిగత జీవితాన్ని పరిశీలిస్తే… ఆయనకు అధికారికంగా మూడు పెళ్లిళ్లు అయ్యాయి. పవిత్ర లోకేష్ తో కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. తన పలుకుబడి ఉపయోగించి ఆమెకు ఆఫర్స్ వచ్చేలా చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో నరేష్ నటించిన పలు చిత్రాల్లో పవిత్ర లోకేష్ భార్యగా, చెల్లిగా చేశారు. ఇక నరేష్ దివంగత నటి విజయనిర్మల కొడుకన్న విషయం తెలిసిందే. విజయనిర్మల మొదటి భర్తకు పుట్టిన సంతానం. కృష్ణ ఆయనకు స్టెప్ ఫాదర్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *