హీరోయిన్ సదా ఇప్పటికి పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏంటో తెలుసా..?

అందాల నటి సదా గురించి పరిచయం చేయాల్సిన పనిలేదు. సదా జయం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమాలో సదా, నితిన్ సరసన నటించి మెప్పించారు. ఇక ఆ తర్వాత ఆమె వరుసగా పలు చిత్రాల్లో నటించి అలరించారు. ప్రస్తుతం సదా ఎటువంటి సినిమాల్లో నటించడం లేదు. అయితే తేజ దర్శకత్వంలో తెరకెక్కిన జయం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది అందాల భామ సదా. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది ఈ చిన్నది. తనదైన నటనతో ఆకట్టుకున్న సదా ఆతర్వాత తెలుగులో వరుస సినిమాలు చేసింది.

తెలుగుతో పాటు తమిళ్ లోనూ అలాగా అడపాదప మలయాళంలోనూ నటించింది సదా. తమిళ్ లో విక్రమ్ తో కలిసి నటించిన అపరిచితుడు సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అప్పట్లో సదా పేరు మారుమ్రోగింది. కానీ మెల్లగా ఈ అమ్మడికి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. దాంతో ఈ అమ్మడు కనుమరుగైపోయింది. ఇక ఇప్పుడు మరోసారి హీరోయిన్ గా సత్తా చాటాలని సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. సినిమాలతోనే కాదు పలు టీవీ షోలకు జడ్జ్ గానూ వ్యవహరిస్తోంది. ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది సదా. రకరకాల ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. ఈ అమ్మడికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది.

ఇదిలా ఉంటే ఇంతవారు సదా పెళ్లి చేసుకోలేదు. మూడుపదుల వయసు దాటిపోతున్న కూడా సదా పెళ్లి చేసుకోలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తాను ఎందుకు పెళ్లి చేసుకోలేదో తెలిపింది ఈ అమ్మడు. పెళ్లి చేసుకోలేదు కాబట్టే చాలా సంతోషంగా ఉన్నాను.. నాకు కావాల్సినంత ఫ్రీడమ్ ఉంది అని తెలిపింది సదా. అలాగే వైల్డ్ లైఫ్ అంటే చాలా ఇష్టమని జంతువులను ప్రేమించడం ఇష్టమని తెలిపింది సదా. పెళ్లి చేసుకుంటే ఇవన్నీ దొరకవు.. మనల్ని అర్ధం చేసుకునే వాళ్ళు ఉంటారు.. అర్ధం చేసుకొని వాళ్ళు ఉంటారు.. పైగా ఇప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళు విడిపోతున్నారు కూడా.. అలాంటప్పుడు పెళ్లి చేసుకోకపోవడమే బెటర్ కదా అంటూ చెప్పుకొచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *