బిగ్ బాస్ హౌస్ లో అప్పుడే మొదలైన ఎఫైర్లు, కన్నీళ్లు పెట్టుకున్న నటి.

ఆదివారం 14 మంది హౌస్ మేట్స్ ఇంట్లోకి వెళ్లడంతో మొదటి ఎపిసోడ్ కు ఎండ్ పడింది. ఇక సోమవారం రోజున నామినేషన్స్ మొదలయ్యాయి. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా హీరో నవీన్ పోలిశెట్టి బిగ్ బాస్ హౌస్ లో కి ఎంట్రీ ఇచ్చాడు, అయితే ఇక అంతకుముందు సీజన్స్ లా కాకుండా ఉల్టా ఫుల్టా అని నాగార్జున చెప్పడంతో ఈ సీజన్ పై కొద్దిగా ఆసక్తి నెలకొంది. ఇప్పుడు లోపల ఉన్నవారు కేవలం గెస్టులుగా వెళ్ళినవారు మాత్రమే అంట.. కంటెస్టెంట్స్ గా మారాలి అంటే బిగ్ బాస్ పెట్టే టాస్క్స్ కొన్ని చేయాలనీ నాగ్ చెప్పడంతో ఇదేదో కొత్తగా ఉంది అని అనుకుంటున్నారు.

ఇక మొదటి రోజు ఎపిసోడ్ లో ఒకరినొకరు పరిచయాలు చేసుకోవడం.. ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవడం చూపించారు. ఈసారి బిగ్ బాస్ లో ప్రజలకు తెల్సిన ముఖాలే ఎక్కువగా ఉన్నాయి. అంతేనా.. అందాల ఆరబోత చేసే హీరోయిన్లు మస్తు మంది ఉన్నారు. ఇక ముందు నుంచి ఉన్నట్లుగానే బిగ్ బాస్ లో పులిహోరలు.. ఎఫైర్లు మొదటిరోజునుంచే మొదలయ్యాయి.ఇప్పటికే రెండు జంటలకు బిగ్ బాస్ లవ్ మ్యూజిక్ కూడా వేసేశాడు. అందులో ఒకటి.. హీరోయిన్ శుభ శ్రీ, యాక్టర్ కమ్ డాక్టర్ గౌతమ్ కృష్ణ తో ప్రేమాయణం మొదలుపెట్టాడు.

ఇక ఇంకోపక్క హీరోయిన్ రతికా రోజ్ తో యూట్యూబర్ పల్లవి ప్రశాంత్ కు ఎఫైర్ మొదలయ్యింది.
నవీన్ పోలిశెట్టి వెళ్లి కాసేపు హౌస్ మేట్స్ ను నవ్వించి ఈ సీజన్ లో ఎవరు మీకు లేడీ లక్ అవుతుందో వారికి ఒక బ్యాండ్ కట్టాలి అని చెప్పగా.. వెంటనే పల్లవి ప్రశాంత్.. రతికాకు బ్యాండ్ కట్టాడు. ఇక వీరిద్దరి మధ్య ఏదో ఉన్నట్లు.. మ్యూజిక్ వేశారు. ఇక రతికకు పల్లవి ప్రశాంత్ పులిహోర కలపడం కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే బయట పల్లవి ప్రశాంత్ కు ఆల్రెడీ పెళ్లి అవ్వగా.. దీనివలన అతను బయటకు వచ్చాక ఎలాంటి సమస్యలను ఎదుర్కుంటాడో చూడాలని అభిమానులు అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *