ఆదివారం నాడు ఆయన తన కారులో స్నేహితులతో కలిసి ప్రయాణిస్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు స్పష్టమవుతుంది. ఈ ఘటనలో శివకుమార్ తో పాటు అతని స్నేహితులు కూడా మరణించినట్టు తెలుస్తుంది. అయితే తమిళనాడులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రముఖ దక్షిణాది సంగీత దర్శకుడు దశి అలియాస్ శివకుమార్ కన్నుమూశారు. తన స్నేహితులతో కలిసి కేరళ నుంచి చెన్నైకి కారులో ప్రయాణం చేస్తుండగా ప్రమాదం జరిగింది.
తిరువూరు జిల్లా అవినాశి టౌన్ సమీపంలోకి రాగానే కారు ముందు టైర్ అకస్మాత్తుగా పేలింది. దీంతో కారు అదుపు తప్పి పక్కనే ఉన్న డివైడర్ ని ఢీ కొట్టడంతో కారు కొట్టి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదం అంతా కూడా క్షణాల్లో జరిగిపోయిందని స్థానికులు చెబుతున్నారు. ప్రమాద సమయంలో కారును శివకుమార్ స్నేహితుడు తమిళ్ అదియన్ నడుపుతున్నారు. రెప్పపాటులో జరిగిన ఈ ప్రమాదంలో సంగీత దర్శకుడు శివకుమార్, అతడి స్నేహితుడు ఆడియన్ అక్కడికక్కడే మృతి చెందారు. ఇంకా ఇద్దరు స్నేహితులు నాగరాజ్, మూవేందన్ తీవ్రంగా గాయపడ్డారు.

ఈ ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తమిళం, మలయాళీ భాషల్లో భాషల్లో అనేక చిత్రాలకు సంగీతం అందించారు శివకుమార్. మలయాళ సినిమా ‘దంధార’కు గాను శివకుమార్ కేరళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ సంగీత దర్శకుడు పురస్కారం లభించింది. తమిళంలో ఆయన బాణీలు కట్టిన ఓత్త వీడు, అడవార్, సతనాయి పయనం సినిమాలు మంచి ఆదరణ పొందాయి. శివ కుమార్ మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.