కొత్త ఇంట్లో చేరిన వైవా హర్ష. గృహ ప్రవేశనికి వచ్చిన ముఖ్య అతిథి ఎవరో తెలుసా..?

వైవా హర్ష గృహ ప్రవేశ కార్యక్రమానికి మెగా హీరో సాయిధరమ్ తేజ్ విచ్చేశాడు. హర్షకు, సాయిధరమ్ తేజ్ కు మధ్య చాలాకాలంగా స్నేహం ఉంది. తాజాగా గృహప్రవేశానికి హాజరైన సాయిధరమ్ తేజ్… వైవా హర్షకు, అతడి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశాడు. అయితే కొత్తింటి కల సాకారం చేసుకున్న వైవా హర్షకు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు విషెస్‌ చెబుతున్నారు. ఒక యూట్యూబర్‌గా కెరీర్‌ ఆరంభించాడు హర్ష.. వైవా కాన్సెప్ట్‌తో అతను తీసిన షార్ట్‌ఫిల్మ్స్‌ సూపర్‌ హిట్‌ అయ్యాయి. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి.

దీంతో అప్పటి నుంచే వైవా హర్షగా పాపులర్‌ అయిపోయాడు. ఈ ట్యాలెంట్‌తోనే ల్లో అవకాశాలు సొంతం చేసుకున్నాడు. 2013లో మసాలా తో సిల్వర్‌ స్క్రీన్‌పైకి ఎంట్రీ ఇచ్చిన వైవా హర్ష మైనే ప్యార్‌కియా, పవర్‌, గోవిందుడు అందరివాడేలే, సూర్య వర్సెస్‌ సూర్య, సైజ్‌ జీరో, దోచేయ్‌, శంకరా భరణం, జక్కన్న, ఎక్కడికి పోతావు చిన్నవాడా, రాజా ది గ్రేట్‌, నక్షత్రం, జై లవకుశ, తొలి ప్రేమ, తేజ్‌ ఐ లవ్యూ, భానుమతి అండ్‌ రామకృష్ణ ల్లో నటించి మెప్పించాడు.

సుహాస్‌ నటించిన కలర్‌ ఫొటోలో వైవా హర్ష నటన అందరికీ గుర్తుండిపోతుంది. క్లైమాక్స్‌లో తన యాక్టింగ్‌తో అందరి చేత కన్నీళ్లు పెట్టించాడీ కమెడియన్‌. ఈ తర్వాత సూపర్‌ హిట్ ల్లో ఛాన్స్‌లు అందుకున్నాడు. వివాహ భోజనంబు, మంచి రోజులొచ్చాయ్‌, కార్తికేయ 2, బింబిసార, బేబీ, మిస్టర్‌ ప్రెగ్నెంట్‌ వంటి సూపర్‌ హిట్ ల్లో నటించాడు. కాగా ఇప్పటివరకు కమెడియన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మెప్పించిన వైవా హర్ష ఇప్పుడు హీరోగా తన అదృష్టం పరీక్షించుకుంటున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *