తాజాగా నిహారిక సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేయగా ఆ పోస్ట్ హాట్ టాపిక్ అవుతోంది.ఆ వీడియోలో ప్రతి అమ్మాయిల గ్యాంగ్ లో నాలుగు రకాల అమ్మాయిలు ఉంటారని ఒక అమ్మాయి ఎప్పుడూ మంచి డ్రెస్ వేసుకోవడానికి ఆసక్తి చూపుతుందని మరొకరు ఏ డ్రెస్ వేసుకున్నా కాన్ఫిడెంట్ గా ఉంటారని అన్నారు. అయితే నీహారిక మాత్రం పెళ్లి తర్వాత ఫుల్ జోష్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో నీహారిక ఓ వీడియో షేర్ చేసింది.
విడాకుల తర్వాత మెగాడాటర్ షేర్ చేసిన ఫస్ట్ పోస్ట్ కూడా ఇదే. ఈ వీడియోలో నీహారిక హ్యాపీగా కనిపించింది. తన ఫ్రెండ్స్‌తో చిల్ అవుతూ ప్రతి గార్ల్స్ గ్యాంగ్‌లో అమ్మాయిల ఇలా ఉంటారంటూ చెప్పుకొచ్చింది. ‘ప్రతి అమ్మాయిల గ్యాంగ్‌లో నాలుగు రకాల అమ్మాయిలు ఉంటారు. ఒకరు ఎప్పుడు మంచిగా డ్రెస్సింగ్ వేసుకునేందుకు ఆసక్తి చూపుతారంటూ తన గురించి చెప్పింది. ఇంకొకరు ఏది వేసుకున్నా కాన్ఫిడెంట్‌గా ఉంటారు. మరొకరు కనీసం రెడీ అయ్యేందుకు కూడా ఇంట్రెస్ట్ చూపరు. చివరిగా ఓ మహాతల్లి ఉంటుంది.
తనెప్పుడు అస్సలు కనపడదు..’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా నటుడు నాగబాబు కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నీహారిక తన కంటూ ఓ ఇమేజ్‌క్రియేట్ చేసుకుంది. నటిగా, నిర్మాతగా రాణిస్తూ కెరీర్లో నిలదొక్కు కునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా విడాకులు తీసుకున్నట్లు అటు నీహారిక, ఇటు చైతన్య జొన్నల గడ్డకూడా అధికారికంగా ప్రకటించారు. నేను, చైతన్య పరస్పర అంగీకారంతోనే విడిపోవాలని డిసైడ్ అయ్యాం. నాతో ఉండి సపోర్ట్ ఇచ్చిన ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్‌కు ధన్యవాదాలు. మా వ్యక్తిగత జీవితాల్లో ముందుకు వెళ్లేందుకు మాకు కొంత ప్రైవసీ ఇవ్వాలని కోరుకుంటున్నానని నీహారిక తెలిపింది.