పాత నాణేల విక్రయానికి పలు ఆన్‌లైన్ సైట్లు కూడా వెలిశాయి. అటు.. ఔత్సాహికులు కూడా పాత నాణేలు కొనటానికి వెనుకాడటం లేదు. చాలామంది పాత నాణేలు ఇచ్చి, లక్షలు పోగేసుకొంటున్నారు. అయితే క్వికర్ వెబ్‌సైట్‌లో పాత నాణేల కొనుగోలు, విక్రయాలు జరుగుతున్నట్టు తెలుస్తున్నది. పాత నాణేలను విక్రయించేందుకు ముందుగా మన వివరాలతో వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
విక్రయించదలచుకున్న నాణేల ఫొటోలు, వివరాలను జతచేయాలి. ప్రస్తుతం భారతదేశ పటం బొమ్మగా ఉన్న రూ.5 పాత నాణెం, పాత రూపాయి, ఐదు రుపాయల నాణేలు, పాత పది, ఐదు రూపాయల కరెన్సీ నోట్లకు ఎక్కువగా డిమాండ్ ఉన్నట్టు తెలుస్తున్నది. అయితే, ఈ నాణేల విక్రయానికి తమకు ఏ సంబంధం లేదని భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది.
ఆర్బీఐ పేరును, లోగోను వాడి కమీషన్లు, ట్యాక్స్‌ల పేరిట డబ్బులు వసూలు చేయటం నిబంధనలకు విరుద్ధం అని సర్క్యులర్ జారీ చేసింది.