బ్రేకింగ్ న్యూస్, లైంగిక వేధింపు కేసులో ప్రముఖ నటుడికి జైలు శిక్ష!

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్‌గా వచ్చిన ఈ కొరియన్ సర్వైవల్ థ్రిల్లర్‌కు విపరీతమైన అభిమానులు ఏర్పడ్డారు. దీంతో దీనికి సీక్వెల్ తెరకెక్కించే పనిలో ఉన్నారు మేకర్స్. ఇటీవలే స్క్విడ్ గేమ్ సీజన్ 2పై ఓ వీడియో ద్వారా మేకర్స్ అప్డేట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే స్క్విడ్‌ గేమ్‌ వెబ్ సీరీస్ లో కీలక పాత్రలో కనిపించిన నటుడు ఓ యోంగ్ పై తాజాగా లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయ.

2017 లో వచ్చిన అభియోగాలపై 79 వయసులో ఈ నటుడికి దక్షిణ కొరియా కోర్టు శిక్ష విధించింది. స్క్విడ్‌ గేమ్‌ వెబ్ సీరీస్ హిట్ కావడంతో ఈ మధ్య సీజన్ 2 పై ఓ వీడియో ద్వారా మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. ఓ యోంగ్ సు (79) పై లైంగిక వేధింపు కేసులో సువాన్ జిల్లా కోర్టు సియోంగ్నామ్ శాఖ ఎనిమిది నెలల జైలు శిక్ష విధించింది. వేధింపు కేసు ఉంది. 2017 లో ఓ గ్రామంలో ధియేటర్ ప్రదర్శనకు కోసం వెళ్లిన సమయంలో ఈ దుశ్చర్యకు పాల్పపడినట్లు వార్తలు వచ్చాయి.

అక్కడ ఓ సరస్సు దాటేందుకు మహిళ సహాయం అడగా ఆమె చేయి పట్టుకున్నట్లు యోంగ్ చెబుతున్నాడు. అంతేకాదు ఆ ఘటన జరిగిన తర్వాత ఆమెకు క్షమాపణలు కూడా చెప్పినప్పటికీ తనపై లైంగిక కేసు నమోదు అయిందని అంటున్నారు. 50 ఏళ్లుగా ఆయన ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. స్క్విడ్‌ గేమ్‌ వెబ్ సీరీస్ తో బాగా పాపులర్ అయ్యారు. తప్పు చేస్తే ఎలాంటి వారికైనా శిక్ష తప్పదని నెటిజన్లు అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *