మహబూబ్‌నగర్‌కి చెందిన రేవంత్ రెడ్డి చిన్ననాటి నుంచే రాజకీయాల పట్ల ఆసక్తి కనబరిచేవారు. గ్రాడ్యూయేషన్ చదవుతున్న సమయంలో ఆయన అఖిల భారత విద్యార్థి పరిషత్ నాయకుడిగా ఉన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏ.వీ. కాలేజీ నుంచి డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు జైపాల్ రెడ్డి మేనకోడలు గీతాను వివాహమాడారు.
అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరి పూర్తిస్థాయి రాజకీయ కార్యకలాపాల్లోకి దిగారు. అయితే పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి, కార్యకర్తలకు కొండంత బలాన్నిచ్చి హస్తం పార్టీని విజయతీరాలకు చేర్చిన మాస్ లీడర్ రేవంత్ రెడ్డి. సొంత పార్టీ నేతలే కాంగ్రెస్ మునిగిపోయే పడవ అంటూ ఎద్దేవ చేస్తూ పార్టీని వీడారు.
అయినా అధైర్యపడకుండా యోధుడిలా తన శక్తినంతా ధారబోసి తెలంగాణలో పార్టీ మనుగడకు కారణమయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉనికే లేదన్న ప్రతిపక్ష లీడర్ల నోళ్లు మూయించారు. అంతిమంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 64 స్థానాలు కైవసం చేసుకుని నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు రేవంత్ రెడ్డి.