యూట్యూబ్ అనేది అంతర్జాలంలో వీడియోలను ఇతరులతో పంచుకోవడాని వీలుకల్పించే ఒక అంతర్జాతీయ సేవ. దీని ప్రధాన కార్యాలయం అమెరికాలోని, కాలిఫోర్నియా రాష్ట్రం, శాన్ బ్రూనో అనే నగరంలో ఉంది. అయితే మనలో చాలామంది యూట్యూబ్ను ఎంటర్టైన్మెంట్ కోసం ఉపయోగిస్తారనే సంగతి తెలిసిందే.అయితే ఉన్నత చదువులు చదువుకోవాలని భావించే వాళ్లకు ప్రయోజనం చేకూర్చేలా యూట్యూబ్ లో ఎన్నో అద్భుతమైన వీడియోలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం పురుషులతో సమానంగా మహిళలు రాణిస్తున్న సంగతి తెలిసిందే.
చిన్నస్థాయిలో ఉద్యోగం నుంచి పెద్దస్థాయిలో ఊద్యోగం వరకు మహిళలు అన్ని ఉద్యోగాలు చేస్తూ సత్తా చాటడంతో పాటు ప్రశంసలు పొందుతున్నారు. సివిల్స్ సాధించిన యువతులలో ఢిల్లీకి చెందిన అనుష్త కాలియా ఒకరు కాగా ఈ యువతి సక్సెస్ స్టోరీ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తుందని చెప్పవచ్చు. తొలి ప్రయత్నంలోనే యూపీఎస్సీ సివిల్స్ లో అనుష్త కాలియా 143వ ర్యాంక్ సాధించడం గమనార్హం. ఆనుష్త కలియా కాలేజ్ లో చదువుకునే రోజుల్లోనే బ్యాడ్మింటన్, కరాటే పోటీలలో పాల్గొన్నారని సమాచారం అందుతోంది. శిక్షణ అనంతరం అనుష్త గంటకు 16 కిలోమీటర్లు పరిగెత్తే సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు.
ప్రజాసేవలో టెక్నాలజీని ఉపయోగించడమే తన లక్ష్యమని ఆమె వెల్లడిస్తున్నారు. ఎన్.పీ.ఏ శిక్షణలో తాను ఎన్నో అంశాలను నేర్చుకున్నానని అనుష్త చెబుతున్నారు. నెల రోజుల జంగిల్ ట్రైనింగ్ నాకు ఎంతో కష్టంగా అనిపించిందని ఆమె చెప్పుకొచ్చారు. ఢిల్లీ యూనివర్సిటీలో బీటెక్ పూర్తి చేసిన అనుష్త అక్కడే బ్లింకిట్ అనే కంపెనీలో డేటా సైంటిస్ట్ గా చేరారు. సివిల్ సర్వీసెస్ పై ఉన్న ఆసక్తితో ఆరు నెలలకే ఉద్యోగానికి రాజీనామా చేసిన అనుష్త కరోనా సమయంలో ఆన్ లైన్ క్లాసుల ద్వారా శిక్షణ పొంది కెరీర్ పరంగా లక్ష్యాన్ని సాధించారు. అనుష్త వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.