జబర్దస్త్ నటుడికి యాక్సిడెంట్, నడవలేని స్థితిలో యాదమ్మ రాజు.

‘పటాస్’ కామెడీ షోతో తనదైన పంచులు, టైమింగ్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు యాదమ రాజు. ఈ టీవీల ప్రసారమయ్యే ‘జబర్దస్త్’ కామెడీ షోలో సద్దాంతో కలిసి టీమ్ లీడర్‌గా చేస్తున్నాడు. విలక్షణ కాన్సెప్ట్‌తో స్కిట్స్‌ వేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించే యాదమ రాజు సడన్‌గా కాలికి కట్టుతో కనిపించాడు. అయితే యాదమ్మ రాజుకు యాక్సిడెంట్ అయ్యిందని తెలుస్తోంది. ఈ విషయాన్నీ అతని భార్య స్టెల్లా సోషల్ మీడియాద్వారా తెలిపింది.

యాదమ్మ రాజుకు చిన్న యాక్సిడెంట్ అయ్యింది. కాలు విరిగింది.. ఇప్పుడిప్పుడే ఆయన కోలుకుంటున్నారు. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్న అభిమానులందరికి థాంక్స్ అంటూ చెప్పుకొచ్చింది. హాస్పిటల్ లో యాదమ్మరాజు చికిత్స పొందుతున్నాడు. కాలు విరిగినట్లు తెలుస్తోంది. ఇక ఈ వీడియో చూసిన అభిమానులు యాదమ్మ రాజు త్వరగా కోలుకోవాలని కోరుతుండగా .. మరికొందరు స్టెల్లా చేసిన పనికి బూతులు తిడుతున్నారు. మొదటి నుంచి కూడా స్టెల్లా, యాదమ్మ రాజు రీల్స్ చేస్తూ ఫేమస్ అయిన విషయం తెల్సిందే.

అయితే భర్త హాస్పిటల్ లో ఉన్నా కూడా ఆమె రీల్స్ చేయడం.. దాన్ని కూడా లైక్స్ కోసం వాడుకోవడంతో కొంతమంది అభిమానులు ఆమెను బూతులు తిడుతున్నారు. ఈ సమయంలో కూడా అతనితో రీల్స్ చేయడం అవసరమా.. ? ఇలాంటి సీరియస్ విషయాన్ని కూడా రీల్స్ చేసి చెప్పాలా.. ? అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇకపోతే ఈ మధ్యనే ఈ జంట విడాకులు తీసుకోనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. ఒక షో కోసం వీరిద్దరూ విడిపోతున్నట్లు నటించడంతో చాలామంది వారు నిజంగానే విడిపోతున్నారని ప్రచారం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *