పటాస్ ప్రోగ్రాం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన యాదమ్మ రాజు ఆ తర్వాత జబర్దస్త్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చి తనదైన కామెడీతో అందరినీ అలరించాడు. యాదమ్మ రాజు గత ఏడాది డిసెంబర్ 11న స్టెల్లా అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే యాదమ్మ రాజు స్టెల్లాను పెళ్లి చేసుకొని ఆమెతో ప్రతిరోజు వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.
చూడముచ్చటైన జంటగా కనిపిస్తూ ఎంతో ఆనందమైన జీవితాన్ని గడుపుతున్న యాదమ్మ రాజు దంపతులు మరో షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ జంట తిరిగి మళ్లీ పెళ్లి చేసుకున్నారు. దీనికి ప్రధాన కారణం వీరి వివాహాన్ని చట్టబద్ధం చేయాలనే ఉద్దేశంతోనే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారని,
దీనికోసం పట్టుబట్టలతో వచ్చి రిజిస్ట్రేషన్ ఆఫీసులో దండలు మార్చుకొని వారి పెళ్లిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలుస్తోంది. అలా దండలు మార్చుకున్న తర్వాత మరోసారి స్వీట్లు తెప్పించి అందరికీ పంచారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.