టాలీవుడ్ లో విషాదం, ప్రముఖ కథా రచయత శ్రీమణ మృతి.

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీ రమణ నేడు జులై 19 తెల్లవారుజామున 5 గంటలకు మరణించారు. 70 ఏళ్ళ వయసులో కన్నుమూశారు శ్రీ రమణ. దీంతో చిత్రపరిశ్రమలో విషాదం నెలకొంది. పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. అయితే ఒక్కొక్కరుగా ఈ లోకాన్ని విడిచిపోతున్నారు. తాజాగా మిథునం కథా రచయత శ్రీరమణ అనారోగ్యంతో కన్నుమూసారు.

ఈయన వయసు 71 యేళ్లు. ముఖ్యంగా వ్యంగ్య రచనలకు ఈయన పేరు ప్రఖ్యాతలు పొందారు. సినిమాగా తెరకెక్కిన మిథునం కథా రచయతగా ఈయన పాపులర్ అయ్యారు. ముఖ్యంగా పలు పత్రికల్లో వ్యంగ్య హాస్య భరతమైన కథా రచయతగా.. కాలమిస్టుగా, కథకుడిగా.. సినిమా నిర్మాణ నిర్వహణలో సుప్రసిద్ధుడు. ఈయన ‘ప్రతిక’ అనే మాస పత్రికకు గౌరవ సంపాదకుడిగా వ్యవహరించారు.

ఆయన హాస్య రచన విభాగంలో తెలుగు యూనివర్సిటీ నుంచి 2014లో కీర్తి పురస్కారాన్ని అందుకున్నారు. ముఖ్యంగా నవ్య ావార పత్రిక ఎడిటర్‌గా ఈయన పాపులర్ అయ్యారు.ఈయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా వేమురు మండలం.వేమురులోని ఫస్ట్ ఫారమ్‌లో చేరిన ఈయన .. ఆ తర్వాత బాపట్లలోని ఆర్ట్స్ కాలేజీలో పీయూసీ చేసారు. ఈయన కలం నుంచి జాలు వారిన మొగలి రేకులు, శ్రీ చానెల్, శ్రీ కాలమ్, పందిరి, హాస్య జ్యోతి ఎన్నో శీర్షికలు ఈయనకు మంచి పేరు తీసుకొచ్చాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *