ఆడవారిని ఇలా చూడటానికి మగవారు ఎందుకు ఇష్టపడతారో తెలుసా..? అసలు విషయమేంటంటే..?

మారుతున్న కాలంతో మనం కూడా మారిపోతున్నామని అనుకుంటాం కానీ.. ఎన్ని రకాల డ్రస్సులు, లెహంగాలు, లంగా ఓణీలున్నా.. పట్టు చీరల ముందు అవన్నీ దిగదుడుపే. ప్రత్యేక ఫంక్షన్లు, పెళ్లిళ్లలో.. పట్టు చీరలను కట్టాల్సిన పద్ధతిలో కట్టుకుంటే.. ఆడవారిని చూసేందుకు రెండు కళ్లూ చాలవు. అంత అందంగా కనిపిస్తారు. మగువల అందాన్ని పట్టు చీరలు మరింత రెట్టింపు చేస్తాయి. అయితే మన దేశం సంస్కృతి, సాంప్రదాయలకు పెట్టింది పేరు.. కొత్త ఫ్యాషన్ పలకరించిన అమ్మాయిలు చీరల్లోనే చాలా అందంగా ఉంటారు.

చీరల్లోనే ఎన్నో మోడల్స్, ఫ్యాబ్రిక్స్ ఉంటాయి. చీరలు కట్టినప్పుడు అబ్బాయిలకి అదోరకమైన అనుభూతి కలుగుతుంది. కాబట్టి, వారిని ఆ చీరల్లోనే చూసేందుకు మగవారు ఆరాటపడతుంటారు. వారి ప్రియురాళ్ళని చీరల్లో చూడటానికి తెగ ఆశ పడతారు.. అయితే ఒక్క చీరలోనే ఎన్నో స్టైల్స్‌ని క్రియేట్ చేయొచ్చు. అందుకే చీరలు రెగ్యులర్‌గా కట్టినా ఒక్కోసారి ఒక్కో విధంగా కనిపిస్తారు.. అందుకే మగవాళ్ళు ఎక్కువగా చీరలో చూడాలని కోరుకుంటారు. ఈ చీరల్లో ఆడవారు చాలా అందంగా ఉంటారు. వారి శరీరాకృతి బావుంటుంది. ఇవి వేరే ఏ బట్టలు వేసుకున్న అందంగా కనిపించరు.

వారు అలా చీరలు కట్టి నడుస్తుంటే మగవారు ఊరికే అట్రాక్ట్ అయిపోతారు.. ఇంకా చూడాలని అనుకుంటారు.. చీరల్లో ఆడవారు మెచ్యూర్‌గా కనిపిస్తారు. అప్పటి వరకూ ఉన్న పిల్లతనం పోయి వారు పూర్తిగా స్త్రీలలాగా కనిపిస్తారు. వారి బాడీ లాంగ్వేజ్‌ని ఎలివేట్ చేస్తారు. కాబట్టి, మగవారికి చాలా ఇష్టం.. అందరు అబ్బాయిలు కాదు.. కొందరు ఇలానే ఉండాలని అనుకుంటే, మరికొందరు మాత్రం మోడ్రన్ గా ఉండాలని అనుకుంటారు.. ఒక్కోక్కరిది ఒక్కో ఆలోచన, ఇష్టం.. ఏది ఏమైనా అమ్మాయిలు ఇలా చీరలు కట్టుకుంటేనే ఆ అందం వేరేలా ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *