ఇద్దరు పల్లెటూరి మహిళలు అవసరానికి నగరానికి వెళ్లారు.ఈ క్రమంలో రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై ఉన్న ఎస్కలేటర్ ఎక్కాల్సి వచ్చింది.ఎస్కలేటర్ ఎక్కడం తెలీకపోవడంతో.చాలా సేపు ఆలోచించారు.అక్కడున్నవారు కూడా వారికి సలహాలు ఇవ్వలేదు.చివరికి ఏమైతే అదవుతుందిలే అనుకుని ధైర్యం చేసి ఎస్కలేటర్‌పై అడుగుపెట్టారు.
అయితే సోషల్ మీడియాలో ఇద్దరు మహిళలకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇద్దరు పల్లెటూరి మహిళలు.. అనుకోకుండా నగరంలో అడుగుపెట్టాల్సి వచ్చింది. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై ఉన్న ఎస్కలేటర్ వద్దకు రాగానే అసలు సమస్య మొదలైంది. ఎస్కలేటర్ ఎక్కడం తెలీకపోవడంతో.. చాలా సేపు ఆలోచించారు.
చివరికి ఏమైతే అదవుతుందిలే అనుకుని ధైర్యం చేసి ఎస్కలేటర్‌పై అడుగుపెట్టారు. మెట్లు పైకి వెళ్తుండడంతో వారి భయం మరింత పెరిగిపోయింది. కాస్తంత ఎత్తుకు వెళ్లగానే బ్యాలెన్స్ చేసుకోలేక.. ధమేల్‌మని కిందపడ్డారు. పక్కన ఉన్న వారంతా చూస్తూ ఉండిపోయారే గానీ.. వారికి ఎవరూ సాయం చేయలేదు. కింద పడ్డ మహిళలు చివరకు ఎలాగోలా లేచి మెట్లపైనే కూర్చున్నారు. అయితే వారికి ఎలాంటి గాయాలూ కాకపోవడంతో ప్రమాదం తప్పినట్లయింది.