మనిషి యొక్క పుట్టుమచ్చలు వారి జీవితానికి సంబంధించిన అనేక పెద్ద రహస్యాల గురించి చెబుతాయని శాస్త్రం చెబుతుంది. ఈ పుట్టుమచ్చల ద్వారా భవిష్యత్తును తెలుసుకోవచ్చు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. స్త్రీ- పురుషులలో ఒకే భాగంలో పుట్టుమచ్చ ఉండవచ్చు కానీ ఆ పుట్టుమచ్చ ఇద్దరి జీవితాల్లో వేర్వేరు ప్రభావాలను కలిగి ఉంటుంది. అయితే మానవ శరీరంపై చాలా పుట్టుమచ్చలు ఉంటాయి. వీటి ద్వారా ఒక వ్యక్తి స్వభావం, అదృష్టం గురించి తెలుసుకోవచ్చు. ముఖంపై ఉన్న పుట్టు మచ్చలు వారి అందాన్ని రెట్టింపు చేయడమే కాకుండా వారి లక్షణాలను కూడా తెలియజేస్తాయి.
శరీర భాగాలపై ఉన్న పుట్టుమచ్చల ద్వారా ఆ వ్యక్తి ధనవంతుడా, పేదవాడా, మంచి చెడుల గురించి అంచనా వేయవచ్చు. పెదవిపై పుట్టుమచ్చ పై పెదవిపై పుట్టుమచ్చ ఉన్న స్త్రీ చాలా అదృష్టవంతురాలు. ఆమె జీవితంలో అన్ని రకాల ఆనందాలను పొందుతుంది. అలాగే ఒక పురుషుడి పై పెదవిపై పుట్టుమచ్చ ఉంటే ఆ వ్యక్తి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాడు. అతడు అన్ని రకాల సౌకర్యాలను సులభంగా పొందుతాడు. చెవి మీద పుట్టుమచ్చ సాముద్రిక శాస్త్రం ప్రకారం.. చెవులపై పుట్టుమచ్చ ఉన్న వ్యక్తులు కష్టపడి పనిచేసే గుణం కలవారు. చాలా నిజాయితీ పరులు. జీవితంలో శ్రమతో పురోగతి సాధిస్తారు.
చాలా డబ్బు సంపాదిస్తారు. నుదిటిపై పుట్టుమచ్చ సాముద్రిక శాస్త్రం ప్రకారం.. నుదుటి మధ్యలో పుట్టుమచ్చ ఉన్న వ్యక్తులు చాలా అదృష్టవంతులు. అన్ని రకాల ఆనందం, సంతోషాలను అనుభవిస్తారు. అలాంటి వ్యక్తులు చాలా డబ్బు, కీర్తి, గౌరవాన్ని పొందుతారు. కళ్ళ మీద పుట్టుమచ్చ కళ్ళపై పుట్టుమచ్చ ఉన్న వ్యక్తులు సులభంగా ప్రజలను ఆకర్షిస్తారు. కంటి మీద పుట్టుమచ్చ ఉన్న పురుషుడు లేదా స్త్రీలకు అదృష్టం కలిసి వస్తుంది. జీవితంలో సుఖ సంతోషాలతో ఉంటారు.
అరచేతిలో పుట్టుమచ్చ అరచేతి మధ్యలో పుట్టుమచ్చ ఉన్న వ్యక్తి చాలా అదృష్టవంతుడు. అలాంటి వ్యక్తి జీవితం అకస్మాత్తుగా మారుతుంది. అతను అన్ని సంతోషాలను పొందుతాడు. చాలా ధనవంతుడు అవుతాడు. ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసాలు, జానపద నమ్మకాలపై ఆధారపడి మాత్రమే ఉంటుందని గ్రహించండి.