ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఇటీవలి కాలంలో నెట్టింట బాగా వైరల్ అయిన పేరు. సెలబ్రిటీల జ్యోతిష్యం చెబుతూ వార్తల్లో నిలుస్తున్నారు. నాగ చైతన్య, సమంత విడాకులు తీసుకుంటారంటూ బాంబు పేల్చాడు. తీరా చూస్తే వేణు స్వామి చెప్పినట్లుగానే జరగడంతో ఆయన వీడియోలకు వ్యూస్ మిలియన్లు దాటాయి.
ముఖ్యంగా స్టార్ హీరోయిన్ లు తన కోసం క్యూ కట్టే రేంజ్ కు ఎదిగిపోయారు. ప్రముఖ హీరోయిన్లు అనుష్క, రకుల్, రష్మిక మందన్నలకు వివాహం అచ్చిరాదంటూ కూడా చెప్పుకొచ్చాడు. ఇక అందరి జ్యోతిష్యాలు చెప్పే వేణు స్వామి నీ జాతకం ముందు చూసుకో అంటూ నెటిజన్లు కామెంట్లు కూడా ఎక్కువగా వస్తుంటాయి.
వేణు స్వామి ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి పంచుకున్నాడు. జ్యోతిష్యం తన తండ్రి దగ్గర నేర్చుకున్నానని, తరువాత స్వంతంగా అనాలసిస్ చేసి ప్రావీణ్యం పొందినట్లు చెప్పాడు. వేణు స్వామి కెరీర్ ఆరంభంలో ఎన్నో కష్టాలను ఎదుర్కోన్నారట. అదే సమయంలో ఆయన ఒక అమ్మాయితో ప్రేమలో పడినట్లు తెలిపాడు.