అయోధ్య రామాలయం కోసం 30 ఏళ్లుగా ఈ మహిళా ఏం చేస్తుందో తెలుసా..?

రామాలయ నిర్మాణంలో భాగంగా ఈ ఏడాది అక్టోబరు నాటికి గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం పూర్తి అవుతుందని తెలిపారు. నాలుగు అంతస్తుల ఆలయం పూర్తయ్యాక గ్రౌండ్ ఫ్లోర్‌ను రామ్ కథ కోసం ప్రత్యేకంగా రిజర్వ్ చేస్తామని వెల్లడించారు. అయితే జార్ఖండ్‌ లోని ధన్‌బాద్‌ కు చెందిన 85 ఏళ్ళ వృద్ధురాలు సరస్వతి అగర్వాల్ . అయితే, అయోధ్య రామ మందిరం నిర్మించాలని ఎంతో మంది నిరసనలు, పోరాటాలు ఇలా ఎన్నో చేశారు. ఈ క్రమంలోనే ముప్పై సంవత్సరాల క్రితం సరస్వతి రామయ్య మందిరం కోసం మౌన దీక్షను చేపట్టింది.

అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించి ఆ రామయ్యను ప్రతిష్టించేవరకు.. ఎవరితోనూ మాట్లాడాను అని ఆమె శపధం చేసింది. నిత్యం శ్రీరాముని స్మరణనే జపిస్తూ ఆ రామయ్యను భక్తి పారవశ్యంతో కొలుస్తూ ఉండేది. కొన్ని సంవత్సరాల క్రితం సరస్వతి చేపట్టిన మౌన దీక్ష.. ఈనాడు అయోధ్యలో రామ మందిరం నిర్మించడంలో ఓ పాత్రగా నిలిచింది. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతుండడంతో సరస్వతి ఆనందానికి అవధులు లేవు. కాగా, ఇన్ని సంవత్సరాల ఆమె మౌనాన్ని.. అయోధ్యలో రామయ్య ప్రతిష్టాపన రోజునే ‘రామ్, సీతారాం’ అంటూ దీక్షను విరమించనుంది.

ఇక ఆమె తదుపరి జీవితాన్ని కూడా అయోధ్యలోనే రామయ్య సేవ చేసుకుంటూ.. గడపాలని నిశ్చయించుకుందట. ఆ రామయ్య తండ్రి కరుణా కటాక్షం తనపై ఉంది అంటూ సంతోషంతో ఉప్పొంగిపోతుంది. ఈ క్రమంలో ఆమె తన భావాలను ఈ విధంగా వ్యక్తపరిచింది.”నా జీవితం ధన్యమైంది. ప్రాణ ప్రతిష్టలో పాల్గొనేందుకు బాలరాముడు నన్ను ఆహ్వానించాడు. నా ఇన్నాళ్ల తపస్సు సఫలమయ్యింది. నా కల నెరవేరింది. ముప్పై ఏళ్ల తర్వాత నా మౌనం వీడనుంది. నా తదుపరి జీవితాన్ని మహంత్ నృత్య గోపాల్ దాస్ ఆశ్రమంలోనే గడపాలి అనుకుంటున్నాను” అంటూ.. మీడియాతో వ్యక్తపరిచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *