పురుషుల మాదిరిగానే, మహిళా నాగ సాధువుల జీవితం పూర్తిగా దేవునికి అంకితం చేయబడింది. రోజూ పూజతో ప్రారంభమై పూజతోనే ముగుస్తుంది. ఒక స్త్రీ నాగ సాధువుగా మారినప్పుడు వారిని సాధువులు లేదా సాధ్వులు అంటారు. ఆమెను తల్లి అని పిలవడం ప్రారంభిస్తారు. మై బడా, మహిళా నాగ సన్యాసులు ఉండే అఖారా, ప్రయాగ్‌రాజ్‌లోని 2013 కుంభ్‌లో, మై బడాకు దశానం సన్యాసిని అఖారా అని పేరు పెట్టారు. అయితే భారత దేశం ఋషులు, సాధువులకు నిలయం. అనేక రకాల అఖాడాలు, ఋషులు ఉన్నారు. వీరిలో నాగ సాధువులు కూడా ఉన్నారు. వీరు తమ జీవితాలను అరణ్యాలలో.. చాలా ఏకాంత ప్రదేశాలలో గడుపుతారు. నాగ సాధువును మనం చూసే సందర్భాలు చాలా తక్కువ.
వీరు నగ్నంగా ఉంటారు. మహిళా నాగ సాధువులు చాలా వరకు కుంభమేళ, మహాకుంభమేళల్లోనే దర్శనమిస్తుంటారు. ఈ సమయంలో మాత్రమే మహిళా నాగ సాధువులను చూడవచ్చు. నాగ సాధువుల మాదిరిగానే, మహిళా నాగ సాధువులు కూడా చాలా కష్టతరమైన జీవితాన్ని గడుపుతారు. అయితే ఈ మహిళా నాగసాధువులు పురుషుల వలె నగ్నంగా ఉండరు. ఆడ నాగ సాధువులు సాధారణంగా కాషాయ వస్త్రాన్ని ధరిస్తారు. ఆడ నాగ సాధువులు ఏక వస్త్రాన్ని ధరిస్తారు. ఈ వస్త్రం కుట్టబడదు. ఈ వస్త్రాన్ని గంటి అంటారు. దీనితో పాటు.. మహిళా నాగసాధువు ఎల్లప్పుడూ నుదుటిపై తిలకాన్ని ధరిస్తారు.
శరీరానికి భస్మాన్ని పూసుకుంటారు. హిందూ ధర్మంలో మహిళా నాగ సాధువులకు మంచి గౌరవం ఇస్తారు. వీరిని ‘మాతా’ అని పిలుస్తారు. మహిళా నాగ సాధువుగా మారడం అంత సులభం కాదు. వీరు ఎన్నో కఠినమైన పరీక్షలను ఎదుర్కోవల్సి ఉంటుంది. 6-12 సంవత్సరాల వరకు కఠినమైన బ్రహ్మచర్య జీవితాన్ని అనుసరించాలి. ,తనను తాను పూర్తిగా భగవంతుడిని అంకితం చేసుకోవాలి.. ఇలా అనేక ఏళ్ళు పరీక్షలు ఎదుర్కొన్న తర్వాత గురువు ఆ మహిళను నాగ సాధువుగా మార్చడానికి అనుమతిస్తారు. నాగ సాధువు కావడానికి వారు బతికి ఉండగానే తమ పిండదానం చేసుకుంటారు. అనంతరంశిరో ముండనాన్ని చేసుకుంటారు. ఆపై స్నానం చేసిన తరువాత, స్త్రీలను ఆచారాలతో మహిళా నాగ సాధువులవుతారు.
మహిళా నాగ సాధువుల జీవితం చాలా కష్టం.. మహిళా నాగ సన్యాసి అయిన తర్వాత.. ఆమె తన జీవితాన్ని భగవంతునికి అంకితం చేస్తుంది. ఎల్లప్పుడూ భగవంతుని భక్తిలో నిమగ్నమై ఉంటారు. ఉదయం భగవంతుని ఆరాధనతో రోజుని ప్రారంభిస్తారు. రోజంతా వారు భగవంతుడి ధ్యానంతో జీవిస్తారు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు పూజలు చేస్తూనే ఉంటుంది. మహిళా నాగ సాధువులను సాధ్వియ మాత అని పిలుస్తారు. అంతేకాదు నాగిన్, అవధూతని అని కూడా సంబోధిస్తారు. వీరు చాలా అరుదైన సందర్భాల్లో కనిపిస్తుంటారు. సామాన్యులకు దూరంగా దట్టమైన అడవులలో, కొండలలో, గుహలలో జీవిస్తారు. అరుదైన సమయాల్లో మాత్రమే జనంలోకి వస్తుంటారు.