నదిలో స్నానం చేస్తూ మహిళ చేసిన నిర్వాకం చుడండి, దీంతో పోలీసులు ఏం చేసారో తెలుసా..?

ప్రస్తుతం యువతతో పాటూ చాలా మంది మహిళలతో పాటూ వృద్ధుల వరకూ రీల్స్ చేయడం విధిగా మారింది. ఈ పిచ్చి కాస్తా కొన్నిసార్లు ఫీక్స్‌కు వెళ్తోంది. కొందరైతే స్థలం, సమయం, సందర్భంతో పని లేకుండా రీల్స్ చేయడమే ధ్యేయంగా పెట్టుకుంటుంటారు. ఈ క్రమంలో కొన్నిసార్లు వారి నిర్వాకం పెద్ద సమస్యగా మారడంతో పాటూ ఎదుటివారకీ ఇబ్బందిని కలిగిస్తుంటుంది. తాజాగా, ఓ మహిళ ఇలాంటి పనే చేసింది. నదిలో స్నానం చేస్తూ మహిళ చేసిన వీడియో చూసి పోలీసులు షాక్ అయ్యారు.

ఉత్తరప్రదేశ్ లోని ప్రముఖ ఆలయం అయిన అయోధ్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశంలోని అతి పురాతన నగరాలలో ఒకటైన అయోధ్య లోని రామ మందిరం చూడడానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు తరలి వస్తుంటారు. ఈ క్రమంలోనే సరయు నది ఒడ్డున ఉన్న రామ్ కి పైడి ఘాటు వద్ద భక్తులు భక్తిశ్రద్ధలతో స్నానాలు ఆచరిస్తుంటారు. భక్తులు అత్యంత పవిత్రంగా భావించే ఈ స్థలంలో ఓ మహిళ చేసిన నిర్వాకం అందరి ఆగ్రహానికి కారణం అయింది.

దైవదర్శనానికి వచ్చిన మహిళ నదిలో రీల్స్ చేయడానికి సిద్ధమయింది. వీటిలో స్నానం చేస్తూ హిందీ పాటకు అసభ్యకర రీతిలో డ్యాన్స్ చేసింది. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. చివరకు ఈ వీడియో పోలీసుల వరకు వెళ్ళింది. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆలయాలు, ప్రార్థన స్థలాల వద్ద ఇలాంటి చర్యలకు పాల్పడ వద్దని పోలీసులు పలుమార్లు హెచ్చరించారు. కానీ తాజాగా ఈ మహిళ వీడియోతో భక్తులలో ఆగ్రహ ఆవేశాలు పెరిగాయి. ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుచేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *