సీటు విషయంలో కొంతమంది మహిళలు, అమ్మాయిల మధ్య గొడవ జరిగింది. ఇప్పటికే ఈ వీడియోని 90 వేలకు పైగా వీక్షించారు. వందల సంఖ్యలో నెటిజన్లు వీడియోపై స్పందించారు. లైక్‌లు, కామెంట్లతో హోరెత్తించారు. చాలా మంది వినియోగదారులు దీనిపై వ్యాఖ్యానించారు కూడా.. ఏంటి బ్రో ఈ దారుణం ఏసీ కన్నా సీటు కావాలని బట్టలు చిరిగేలా కొట్టుకోవడం ఏంటో అంటూ విడ్డురంగా కామెంట్స్ చేస్తున్నారు.
అయితే ఈ వీడియోలో, పింక్ సూట్ ధరించిన ఒక మహిళ నలుపు రంగు సూట్‌లో ఉన్న ఇతర మహిళను రెచ్చగొట్టే మాటలు అంటోంది. పోరాటానికి ఖచ్చితమైన కారణం అస్పష్టంగా ఉంది. అయితే నలుపు రంగులో ఉన్న మహిళ ఇతర మహిళను కొద్దిగా కదలమని కోరినట్లు వీడియో సూచిస్తుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తూ తిట్టిపోస్తున్నారు.
మహిళలకు పూర్తిగా ఒక భోగీ ఇచ్చారు. మిగతావాటిల్లో కూడా ప్రతీ బోగిలో 8 సీట్లు మహిళలకు రిజర్వ్ చేశారు. అయినా సీట్లు సరిపోవడం లేదు వీళ్లకు అంటూ వ్యంగ్యస్త్రాలు విసురుతున్నారు. ఇంతకుముందు, ఢిల్లీ మెట్రోలో ముద్దులు పెట్టుకునే వీడియోలు.. హస్తప్రయోగం వీడియోలు, రీల్స్ కోసం డ్యాన్స్ చేస్తున్న వీడియోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వీడియోతో మరోసారి ఢిల్లీ మెట్రో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.
Kalesh b/w Some group of girl and woman inside delhi metro over seat issues pic.twitter.com/jvVS5fq5EX
— Ghar Ke Kalesh (@gharkekalesh) August 22, 2023