నిజానికి స్నానం కనీసం అరగంట సేపైనా చేయాలి. అది కూడా ఎలాగంటే… శరీరాన్నినీటితో బాగా తడిపి, సున్నిపిండి లాంటి వాటితో శుభ్రంగా రుద్దుకుని, ఆపై నీటితో శుభ్రపర్చుకోవాలి. స్నానాంతరం శరీరంలోని అవయవాలను శుభ్రంగా తడుచుకోకపోవడం వల్ల అనేక రోగాలు వచ్చే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఎందుకంటే ఈ సమయంలో మన శరీరంలో పునరుజీవన కార్యక్రమాలు చురుగ్గా ఉంటాయి. కాబట్టి సాంప్రదాయం ప్రకారం స్నానం చేసినప్పుడు మనసుతో పాటు శరీరాన్ని కూడా పునరుద్జీవింప చేస్తుంది. మునిస్తానం అంటే తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి 5 గంటల మధ్య స్నానం చేయడమే మునిస్తానం అంటారు.
లేదా దీన్నే సాధువుల అభ్యంగా అని కూడా అంటారు. అంటే స్నానం చేయడానికి ఇది అత్యంత అనుకూలంగా ఉండే సమయాల్లో మొదటిది ఈ సమయంలో గనక స్నానం చేస్తే మీకు ఆనందం మనసుకి ఆహ్లాదం మంచి ఆరోగ్యం వ్యాధులనుంచి ఉపశమనం, రోగనిరోధక శక్తి పెరగటం, తెలివితేటలు పెరగటం, ఏకాగ్రత పెరగటం లాంటివి జరుగుతాయని మన గ్రంధాల్లో పేర్కొనడం జరిగింది. మన శాస్త్రాల ప్రకారం ఉదయం 8 తర్వాత స్నానం చేస్తే కష్టాలు పెరుగుతాయి. మన శరీరం మీద పూర్తి ఏకాగ్రతతో చేయాల్సి ఉంటుంది.
కనీసం 30 నుంచి 40 నిమిషాల పాటు స్నానం అనేది ప్రతి ఒక్కరు ఆచరించాలి. స్నానం అనేది ప్రశాంతంగా ఎలాంటి హడావిడి లేకుండా చేయాలి. స్నానం చేసే ముందు ఒళ్ళంతా నూనెతో మర్దన చేసుకుని ప్రశాంతంగా ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు శరీరాన్ని అలా గాలికి వదిలేసి ఆ తర్వాత గట్టిగా రుద్ది స్నానం చేసుకోవడం అనేది సరైన పద్ధతి. మీరు ఈ స్నానం కోసం ఏమైనా వాడండి.. నీటిలో అగ్ని దేవుడు ఉంటాడు అంటారు. కాబట్టి నగ్నంగా స్నానం చేస్తే అగ్ని దేవుడికి కోపం వస్తుంది.
మనల్ని ఇబ్బందులు పాలు చేస్తారు. అలాగే స్నానం చేసిన తర్వాత చాలామంది మగవాళ్ళు శరీరం మొత్తాన్ని తవల్తో శుభ్రం చేసుకొని నడుముకు చుట్టుకుంటూ ఉంటారు. కాబట్టి స్నానం చేసిన తర్వాత కట్టుకునే వస్తువులు పొడిగా ఉండేలా చూసుకోండి. లేదంటే మీరు తుడుచుకున్న టవల్ పూర్తిగా పిండేసిన తర్వాత కట్టుకోవాలి. తడిగా ఉండే వస్త్రాన్ని ఎట్టి పరిస్థితులను ఉపయోగించకూడదు. అలాగే ముఖ్యంగా ఆడవారికి స్నానం చేసే సమయంలో పాటించాల్సిన నియమాలు చెప్పడం జరిగింది. వారానికి ఒకటి లేదా రెండు రోజులు కలసి చెయ్యొచ్చు.
ప్రతిరోజు చేయాల్సినటువంటి నూనె అయితే ఏమీ లేదు శుక్రవారం చేసుకుంటే చాలా మంచిది అంటారు. ఒకవేళ టవల్ కట్టుకుని స్నానం చేస్తే దాన్ని కింద నుంచి తీయకుండా కేవలం పైనుంచి మాత్రమే తీయాలి. అలాగే ఏదైనా శుభకార్యాలు వేసేటప్పుడు కూడా పైనుంచి వస్త్రాలు తీస్తారు గమనించుకోండి. అలాగే స్నానం చేసే బాత్రూమ్ ని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. ఇలా చేయటం వల్ల శని దేవుడికి అంగారపుడికి కోపం రాకుండా ఉంటుంది.