తారాచంద్ నాయక్.. పుష్పవతికి 2015 వ సంవత్సరంలో వివాహం జరిగింది. వీరిద్దరిదీ ప్రేమ వివాహం. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. పెళ్లయిన ఆరు సంవత్సరాలు చాలా కలిసిమెలిసి సంతోషంగా ఉన్నారు. అయితే కర్నూల్ కి చెందిన తారాచంద్ నాయక్ 2015లో పుష్పవతి అనే మహిళను ప్రేమ వివాహం చేసుకున్నాడు. పెళ్లయిన కొన్నాళ్లపాటు ఇద్దరూ అన్యోన్యంగా ఉన్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే గత రెండేళ్లుగా వీరిద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తాయి.
ఈ క్రమంలో తరచుగా గొడవ పడుతూ ఉండేవారు. శుక్రవారం సాయంత్రం ఇద్దరు మరోసారి గొడవపడ్డారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. కొంతసేపటి తర్వాత తారాచంద్ వెళ్లి తన భార్యకు ముద్దు పెట్టడానికి ప్రయత్నించాడు. అయితే అప్పటికే కోపంతో ఉన్న ఆమె.. తారాచంద్ నాలుకను కొరికేసింది. అంతేకాకుండా తనపై దాడి చేసి తనకి ఇష్టం లేకుండా ముద్దు పెట్టడానికి ప్రయత్నించాడని అందుకే నాలుకను కొరికేసినట్లు పుష్పవతి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది.
ఈ ఘటనపై బాధితుడు తారాచంద్ మాట్లాడుతూ.. తన భార్య వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకుందని, ఆ విషయం తనకి తెలిసినా సర్దుకుపోతున్నానని వాపోయాడు. ఇదే విషయమై పలుమార్లు తనని నిలదీసినట్లు చెప్పాడు. ఈ క్రమంలోనే తనపై కోపంతో తనని గాయపరచినట్లు తెలిపాడు.