ఆమె సంతోషంగా ఉంటే ఆమె కడుపులోని బిడ్డకూడా సంతోషంగా..ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే భర్త చేయకూడని కొన్ని ఆచారాలు కూడా మన హిందూ సంప్రదాయాలలో ఉన్నాయి. అయితే భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ప్రతి భార్య తన భర్త పక్కనే ఉండాలని కోరుకుంటుంది. అలాగే ప్రతి భర్త కూడా తన భార్యకు దగ్గరగా ఉండి తనకు కావలసిన సహాయం చేయాలని భావిస్తారు. భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త తన భార్యను సంతోషంగా చూసుకున్నప్పుడు తనకు పుట్టబోయే బిడ్డ ఎంతో ఆరోగ్యవంతంగా పుడుతుంది.
అయితే భార్య గర్భంతో ఉన్నప్పుడు భర్త కొన్ని పనులను అస్సలు చేయకూడదని పండితులు చెబుతున్నారు. మరి ఆ పనులు ఏమిటి అనే విషయానికి వస్తే. భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త పొరపాటున కూడా తనని వదిలి ఇతర దేశాలకు వెళ్ళకూడదు. అదేవిధంగా భార్య గర్భవతి అని తెలిసినప్పటి నుంచి భర్త నదీస్నానాలు చేయకూడదు. అలాగే భార్యకు ఏడవ నెల వచ్చిన తర్వాత భర్త ఎలాంటి పరిస్థితులలోనూ పడవ ప్రయాణాలు చేయకూడదు. అదేవిధంగా భార్య గర్భంతో ఉన్నప్పుడు భర్త పొరపాటున కూడా ఒక చెట్టును నరకకూడదు అలాగే పామును కూడా చంపకూడదు.
ఇలా చేయటం వల్ల పుట్టబోయే బిడ్డపై అధికంగా చెడు ప్రభావం చూపే పరిస్థితులు ఉంటాయి. అదే విధంగా మీ భార్య ఏడవ నెల గర్భవతి అయినప్పటి నుంచి భర్త పొరపాటున కూడా షేవింగ్ చేసుకోకూడదు. అలాగే శవ యాత్రలకు వెళ్ళకూడదు, శవాలను మోయకూడదని పండితులు చెబుతున్నారు. భార్య గర్భంతో ఉన్నప్పుడు గృహ నిర్మాణాలు చేపట్టడం లేదా గృహ ప్రవేశం చేయడం, శాంతి హోమం చేయటం, పిండ ప్రదానాలు చేయడం వంటివి చేయకూడదు. ముఖ్యంగా ఏడవ నెల గర్భవతిగా భార్య ఉన్నప్పుడు భర్త తీర్థయాత్రలు కూడా చేయకూడదని పండితులు చెబుతున్నారు.