పెళ్ళంటే నూరేళ్ళ పంట అని అంటారు పెద్దలు. అయితే పెద్దలు కుదిర్చిన వివాహమైనా, ప్రేమ వివాహమైనా వారిలోని విభేదాల కారణంగా వారి కాపురాలు కూలిపోతున్నాయి. ఇలా వారి కాపురాలు కూలి పోవడానికి పరాయి వ్యక్తులతో అక్రమ సంబంధం పెట్టుకోవడం ముఖ్య కారణం. అయితే భార్యాభర్తలు లేదా స్త్రీపురుషుల మధ్య సంతృప్తికరమైన శృంగార సుఖం లేకపోవడం ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. బెడ్రూంలో తన భర్త లేదా భార్య ద్వారా సంతృప్తి పొందలేని స్త్రీ లేదా పురుషుడు ఈ తరహా సంబంధాలపై ఆసక్తి చూపుతున్నారు.
అలాగే, శృంగారంలో తన శరీర అందాలను పురుషుడు అసహ్యించుకున్నట్టయితే ఆ స్త్రీ అతనితో శృంగారంలో పాల్గొనేందుకు ఏమాత్రం ఇష్టపడదు. దీంతో పరాయి పురుషుని వైపు చూస్తుంది. అయితే వివాహమైన తర్వాత బాగా అలంకరించుకుని పడక గదికి వచ్చే స్త్రీ.. రోజుల గడిచే కొద్ది తన అలంకరణపై శ్రద్ధ చూపక పోవడం అనేక మంది పురుషులకు పూర్తి నిరాశ కలిగిస్తుంటుంది. అలాగే, పెళ్లికి ముందు తన మనస్సులో ఉండే శృంగార కోర్కెలను పెళ్లి అయిన తర్వాత పూర్తిగా విస్మరించడం మరో కారణం. వివాహానికి ముందు ఉండే వివాహేతర సంబంధాలు కూడా వివాహం తర్వాత కొనసాగించాలన్న మనస్సులో కోర్కె కలుగడం.
వివాహానికి ముందు తనకు కాబోయే భర్త గురించి ఎన్నో ఆశలు పెట్టుకునే స్త్రీ.. అందుకు తగినట్టు తన భర్త గుణగణాలు లేకపోవడం తమ మనస్సులోని కోర్కెలను చంపుకోలేక పరాయి పురుషునితో సంబంధం పెట్టుకుని తమ కోర్కెలను తీర్చుకునేందుకు ఉబలాటపడటం. ఉద్యోగాలకు వెళ్లే మహిళలు తమ కార్యాలయాల్లో పనిచేసే సమయంలో ఇతర మహిళలకు పరాయి పురుషులతో వివాహేతర సంబంధాలు ఉన్నట్టు తెలుసుకోవడం, అదేవిధంగా తాము కూడా సంబంధం పెట్టుకోవాలని భావించడం.
ఇదే తరహా సంబంధాలపై పురుషులు కూడా ఆసక్తి చూపడం. తమ పురుష సహచరులు, బాస్‌లతో అధిక సమయం గడపడం వివాహేతర సంబంధాలు పెట్టుకునేందుకు నాలుగో కారణం. దాంపత్య జీవితంలో ప్రతి రోజూ కొత్తదనం కోరుకునే మహిళలు ఈ తరహా సంబంధాల పట్ల అధిక ఆసక్తి చూపడం. తన భర్త లేదా భార్య తమతో అన్యోన్యంగా, ప్రేమగా మాట్లాడకపోవడం, నడుచుకోక పోవడం కూడా పక్క చూపులు చూస్తున్నారని పలు సర్వేల్లో తేలినట్లు వెల్లడైంది.