బుధవారం నుంచి మూడ్రోజుల పాటు పైన పేర్కొన్న జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని..రాష్ట్ర వ్యాప్తంగా తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురుస్తుందని తెలిపింది. జులై రెండో వారం వచ్చినప్పటికి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా గట్టి వర్షం పడిన దాఖలాలు లేవు. అయితే ఉత్తర తమిళనాడు తీరంలో నైరుతి బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం.. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతం మీదుగా సముద్ర మట్టానికి 4.5 కి.మీ ఎత్తులో కొనసాగుతోందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది.
దీంతో వచ్చే మూడు రోజులు పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఒకట్రెండు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు. రాబోయే 3 రోజుల వాతావరణ సూచనలు ఇలా ఉన్నాయి. ఈరోజు, రేపు ఉత్తర కోస్తాంద్రా, యానాంలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన చిరుజల్లులు పలు ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉంది. అలాగే ఒకట్రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల ఉరుములతో కూడిన మెరుపులు సంభవించవచ్చు.
ఇక ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల, ఉరుములతో కూడిన మెరుపులు ఒకట్రెండు ప్రాంతాల్లో సంభవించే ఛాన్స్ ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే.. ఈరోజు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల, భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఇక రేపు, ఎల్లుండి కూడా ఇదే వాతావరణ కొనసాగుతుంది. అటు రాయలసీమలో ఈరోజు, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.