సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహేష్ బాబు ఆయన భార్య నమ్రత తో కలిసి వెళ్లి ఓటు వేశారు. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో మహేష్ తన ఓటు వేశారు. మహేష్ కంటే ముందు చిరంజీవి, నితిన్, రానా, గోపీచంద్, నాని, విశ్వక్ సేన్ ఇలా చాలా మంది తమ ఓటు హక్కుంబు వినియోగించుకున్నారు. అయితే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.
మొత్తం 119 నియోజకవర్గాలకు ఒకే విడతలో పోలింగ్ చేపట్టారు. కాగా, సెలబ్రిటీలు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ మధ్యాహ్నం తర్వాత రామ్ చరణ్, మహేశ్ బాబు కూడా ఓటు వేశారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన అర్ధాంగి ఉపాసనతో కలిసి జూబ్లీహిల్స్ పోలింగ్ బూత్ వద్దకు వచ్చారు.
చరణ్ రాకతో పోలింగ్ కేంద్రం వద్ద సందడి నెలకొంది. రామ్ చరణ్, ఉపాసన ఓటేసిన అనంతరం అక్కడ్నించి వెళ్లిపోయారు. అటు, మహేశ్ బాబు, నమ్రత దంపతులు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటేసిన అనంతరం వేలికి ఇంకు గుర్తును చూపుతూ మహేశ్ బాబు సోషల్ మీడియాలో స్పందించారు. మేం ఓటు వేశాం… మీరు కూడా ఓటేయండి అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.