విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్‌లో ఆగి ఉన్న దాదాపు 25-30 మత్స్యకారుల పడవలు ఒక పడవలో మంటలు చెలరేగాయి. ఈ బోట్‌లలో చాలా వరకు మెకనైజ్ చేయబడి, ఇంధన ట్యాంకులు మరియు LPG ట్యాంక్‌లతో అమర్చబడి ఉండటంతో, కొన్ని పడవలు ఎక్కువగా పేలాయి, అయితే నిన్న సాయంత్రం లోకల్ బాయ్ నాని తన భార్య శ్రీమంతం వేడుకలు నిర్వహించారు. తన భార్య శ్రీమంతం సందర్భంగా లోకల్ బాయ్ నాని స్నేహితులకు బోటులో పార్టీ ఇచ్చారు. పార్టీ అనంతరం బోటుకు నిప్పు అంటుకుంది.
లోకల్ బాయ్ నాని అగ్ని ప్రమాదాన్ని వీడియో తీసి యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారు. ఇతర మత్స్యకారులు లంగర్ వేసిన బోటును వదిలారు. నిప్పు పెట్టిన బోటు జట్టి నెంబర్ 1లో పడవల వద్దకు చేరుకోవడంతో భారీ ప్రమాదంద జరిగింది. సిలిండర్ పేలడంతో వేగంగా మంటలు వ్యాపించాయి. పడవల్లో డీజిల్, చేపలు ఉన్నాయి. డీజిల్ ఉండటంతో బోట్లు తగలబడిపోయాయి. ప్రమాద సమయంలో హార్బర్ లో 400 రవకు పడవలు ఉన్నాయి. 60 నుంచి 70 బోట్ల వరకు దగ్ధమయ్యాయని మత్స్యకారులు అంటున్నారు. బోటుకు నిప్పు ఎలా అంటుకుందనేది దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. వన్ టౌన్ సిఐ భాస్కరరావు లోతైన విచారణ చేస్తున్నారు.
ఫిషింగ్ హర్బర్ వద్ద ఆందోళన చేస్తున్న మత్స్యకారుల వద్దకు మంత్రి సీదిరి అప్పలరాజు చేరుకున్నారు. సంఘటన స్థలాన్ని మంత్రి పరిశీలించారు. మత్స్యకారులకు న్యాయం చేస్తామని హమీ ఇచ్చారు. సీఎం రావాలంటూ మత్స్యకారులు ఆందోళన చేపట్టారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ లో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం అన్నారు. ప్రమాదానికి గల కారకులను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నామని, వారికి కఠిన శిక్షలు తప్పవన్నారు. 36 బోట్లు పూర్తిగా, 9 పాక్షింగా దెబ్బతిన్నాయని తెలిపారు.