ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, శరీరంలో విటమిన్ల లోపం ఉంటే, వాటిని మందుల ద్వారా కాకుండా ఆహారం ద్వారా భర్తీ చేయడం మేలంటున్నారు. ఏ పండ్లు, కూరగాయలు ఏ విటమిన్లు అందిస్తాయో ప్రజలు తెలుసుకోవాలి. కానీ ఒక్కసారి శరీరంలో విటమిన్ల లోపం ఏర్పడితే ఆ లోపం భర్తీ అవుతుందా లేదా? అనే ప్రశ్నలు తలెత్తుతుంటాయి.
తరచుగా విటమిన్ లోపంతో బాధపడుతున్న వ్యక్తులు ప్రతి 6 నెలలకోసారి విటమిన్ స్థాయిలను తనిఖీ చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వైద్య నిపుణుడు డాక్టర్ సందీప్ భట్నాగర్ విటమిన్ లోపాన్ని అధిగమించడం అస్సలు కష్టమైన పని కాదని చెబుతున్నారు. దీని కోసం మీరు మీ ఆహారంలో పోషకాలు ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోవడమేనని అంటున్నారు.
మీ ఆహారంలో గుడ్లు, చేపలు, పాలు, ఆకుపచ్చ కూరగాయలు, క్యాబేజీ, నిమ్మకాయ, వెన్న, కొబ్బరి నీరు, టొమాటో, సోయాబీన్ నూనె, వేరుశెనగ నూనెను చేర్చండి. ఇందులో పెద్ద పరిమాణంలో విటమిన్లు ఉంటాయి. అదే సమయంలో మీరు ఇప్పటికీ విటమిన్ లోపంతో బాధపడుతున్నట్లయితే, వైద్యుడిని సంప్రదించండి.