సినిమా అవకాశాల కోసం అలా చేస్తే తప్పుఏంటి : విష్ణుప్రియ

సోషల్ మీడియాలో అయితే విష్ణు ప్రియకి స్టార్ హీరోయిన్లకు సమానంగా ఫాలోవర్స్ ఉన్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆమె హీరోయిన్లను మించి అందాలను ఆరబోస్తూ ఉంటుంది. గ్యాప్ లేకుండా ఎప్పటికప్పుడు హాట్ హాట్ అందచందాలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది. ఇక ఈ అమ్మడి అందాలకు సోషల్ మీడియాలో బాగానే ఫాన్స్ ఉన్నారు. అయితే యాంకర్ విష్ణు ప్రియ ముందుగా షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ ముందుగా బుల్లితెరలోకి ఎంట్రీ ఇచ్చింది.

ఇలా బుల్లితెరపై ఎంత ప్రయత్నించినా అనుకున్నంత పేరు మాత్రం రాలేదు.. ఎప్పుడైతే సుధీర్ తో కలిసి పోవే పోరా షోలోకి ఎంట్రీ ఇచ్చిందో అప్పుడే యాంకర్ విష్ణు ప్రియ కెరియర్ మారిపోయింది.. ఒక్కసారిగా పాపులారిటీ పెరిగింది.. ఈటీవీ షోలలో టాప్ యాంకర్ గా ఎదిగింది.. ఈ సమయంలోనే తన అందాలతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది విష్ణు ప్రియ.. కానీ పోవే పోరా ప్రోగ్రాం నిలిచిపోవడంతో సినిమాల వైపు అడుగు వేసింది.. తాజాగా వాంటెడ్ పండుగాడు చిత్రంలో తన టాలెంట్ నిరూపించుకుంది.

ఈ క్రమంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న విష్ణు ప్రియ కాస్టింగ్ కౌచ్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది… తనకు కూడా కాస్టింగ్ కౌచ్ ఎదురైనట్టు చెప్పుకొచ్చింది.. కానీ నేను ఇలాంటి కమిట్మెంట్లు ఇవ్వలేదని తెలియజేసింది. కానీ ఇద్దరికీ ఇష్టం ఉంటే కమిట్మెంట్ ఇవ్వచ్చు అంటూ, దీన్ని తప్పుగా భావించాల్సిన పనిలేదని తెలియజేసింది.. అక్కడ మనల్ని ఎవరూ బలవంతం చేయరు కదా.. మనం ఇష్టం ఉంటేనే ఆ పని చేయడానికి ఒప్పుకుంటాం కదా.. అలాంటప్పుడు తప్పుగా భావించాల్సిన అవసరం ఏముంది అంటూ వివరించింది.. ఇద్దరికీ ఇష్టం లేకుండా ఏ పని జరగదు అంటూ చెప్పుకొచ్చింది విష్ణు ప్రియ.. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *