ఒకప్పటి కోలీవుడ్ హీరోయిన్ లక్ష్మీ మీనన్ తో విశాల్ పెళ్లి ఫిక్స్ అయినట్లు ప్రస్తుతం కోలీవుడ్ మీడియా అంతా కోడైకొస్తోంది. తమిళంలో ప్రభు సోలామన్ డైరెక్ట్ చేసిన ‘కుమ్కీ’ అనే సినిమాతో ఇండస్ట్రీలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న లక్ష్మీ మీనన్. అయితే చాలా రోజుల తర్వాత లక్ష్మీ మీనన్ ప్రస్తుతం చంద్రముఖి 2 చిత్రంలో నటిస్తోంది. 27 ఏళ్ల నటి లక్ష్మీ మీనన్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తమిళనాట ప్రచారం జరుగుతోంది. ప్రముఖ నటుడు విశాల్‌తో ఆమె పెళ్లి జరగబోతుందని కోలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.
దీనిపై అధికారిక సమాచారం వెలువడకపోవడంతో ఇంటర్నెట్‌లో ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే వారిద్దరిలో ఎవరో ఒకరు స్పందిస్తే ఈ పుకార్లకు ఫుల్‌స్టాప్ పడుతుందని పలువురు తెలుపుతున్నారు. నటి లక్ష్మీ మీనన్ విశాల్‌తో కలిసి పాండియనాడు (పల్నాడు), ఇంద్రుడు, వంటి సినిమాల్లో నటించింది. ఈ రెండు సినిమాల్లో విశాల్‌తో ఆమె కెమిస్ట్రీ బాగా కుదిరిందని, వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

కానీ ఆ తర్వాత లక్ష్మీ మీనన్ విశాల్‌తో ఏ సినిమాలోనూ నటించకపోవడం గమనార్హం. ఈ సినిమాల పరిచయం నుంచి వారిద్దరి మధ్య ప్రేమ మొదలైందని తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఇంతవరకు ఇంట్లో వాళ్లకు చెప్పకుండా దాచారని, త్వరలో పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశ్యంతో తాజాగ ఇరుకుటుంబాల పెద్దలకు తెలపడంతోనే ఈ వార్తలు ఇప్పడు ప్రచారంలోకి వచ్చాయని తెలుస్తోంది.