‘జబర్దస్త్’ మాత్రమే కాకుండా మరెన్నో ఈటీవీ షోలలో కూడా లేడీ గెటప్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారాడు వినోద్ అలియాస్ వినోదిని. కెరీర్‌లో గుర్తింపు తెచ్చుకుంటున్న సమయంలో పర్సనల్‌గా తను ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కున్నాడు. అయితే ఓ ఇంటర్వ్యూలో తానుపడుతున్న ఇబ్బందులు, కష్టనష్టాలను చెప్పుకుని బాధపడ్డాడు వినోద్. గతంలో ఇంటి విషయంలో కొంత మంది అతన్ని కొట్టగా.. అది పెద్ద వివాదం అయ్యింది. దాని తరువాత వినోద్ మళ్ళీ కోలుకుని.. పెళ్లి చేసుకుని.. ప్రోగ్రామ్స్ చేసుకుంటూ.. వచ్చాడు. కాని తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన పడుతున్న ఇబ్బందులు ఏకరవు పెట్టాడు.
ముఖ్యంగా తాను రకరకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు అతను వెల్లడించాడు. తన ఆరోగ్యం బాగాలేనప్పుడు జబర్దస్త్‌లోని సహ నటులైన చమ్మక్ చంద్ర, అభి, రాకేశ్, గెటప్ శ్రీను, సుధీర్, రామ్‌ప్రసాద్ వంటివారందరూ తనకు సాయం చేసి అండగా నిలిచారని గుర్తు చేసుకున్నాడు. అయితే, తనంత తానుగా ఎవరినీ సాయం అడగలేదని పేర్కొన్నాడు. తన అనారోగ్యం గురించి తెలుసుకుని వారే ముుందుకు వచ్చి సాయం అందించారన్నాడు వినోద్. తాను ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసి మంత్రి రోజా కూడా సాయం చేశారంటున్నాడు వినోద్. అనారోగ్యంతో బాధపడిన వినోద్..

ప్రస్తుతం కోలుకుంటున్నట్టు వెల్లటించారు. ఇంకాస్త ఆరోగ్యం కుదుటపడిన తరువాత ఈవెంట్స్ చేయడంతోపాటు త్వరలోనే జబర్దస్త్ షోకి తిరిగి వస్తానని వెల్లడించాడు. అంతే కాదు మరికొన్ని షాకింగ్ విషయాలు వెల్లడించాడు వినోద్. తన ఆరోగ్యం బాగాలేకపోవడానికి చేతబడి కారణమనే అనుమానం వస్తుందన్నారు. దానికి సబంధించి కూడా కొన్ని పూజలు చేయించినట్టు వినోద్ వెల్లడించాడు. అంతే కాదు దానిని కూడా చాలా ఖర్చుు అయ్యిందన్నారు. అటు హాస్పిటల్ కు..పూజలకు కలిపి.. 3 లక్షల వరకూ ఖర్చుక అయ్యిందన్నారు. ఇప్పటికైతే ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేవని వివరించాడు.
ఇంటి కోసం జరిగిన గొడవలో తన చేయి విరిగిందని వాపోయాడు. ఓ విషయంలో హామీగా ఉండడం ద్వారా రూ. 5 లక్షలు నష్టపోయానని వినోద్ ఆవేదన వ్యక్తం చేశాడు. కాకపోతే అనారోగ్యం కారణంగా వినోద్ చాలా తగ్గిపోయి.. పేలగా తయారయ్యాడు. మునుపటి వినోద్ కు.. ఇప్పటి వినోద్ కు చాలా తేడా కనిపిస్తోంది. వినోద్ ను ఇలా చూసి.. జబర్థస్త్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.. బాధపడుతున్నారు.