షర్మిల తెలంగాణ ఎన్నికల్లో పోటీ నేపథ్యంలో విజయలక్ష్మి పూజలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన కోసం పలు తేదీలు పరిశీలించినట్టు సమాచారం. షర్మిల పొలిటికల్ ఫ్యూచర్ పై సిద్ధాంతితో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా ఎన్నికల సమయంలో సిద్ధాంతి హనుమంతరావుతో వైఎస్ విజయలక్ష్మి ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు.
అయితే వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి తల్లి వైఎస్ విజయలక్ష్మికి పెను ప్రమాదం తప్పింది. శుక్రవారం నాడు హైదరాబాద్ నుంచి ఒంగోలు బయల్దేరిన వెళ్లారు. అయితే.. మార్గమధ్యంలో సంతమాగులూరు వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. కారు డ్రైవర్ సడన్‌గా బ్రేక్ వేయడంతో వెనుక వేగంగా వస్తున్న కాన్వాయ్‌లోని కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి.

ఈ ప్రమాదంలో ఆమె ప్రయాణిస్తున్న కారు వెనుక భాగం దెబ్బతింది. అయితే ఈ ఘటనలో విజయమ్మకు, కారులో ప్రయాణిస్తున్న ఇతరులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. అనంతరం అదే కారులో ఆమె ఒంగోలుకు చేరుకున్నారు. ప్రమాదం విషయం తెలుసుకున్న తనయుడు జగన్, కూతురు షర్మిల ఆమెకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. ఇదిలా ఉంటే.. కూతురు షర్మిల స్థాపించిన వైఎస్ఆర్‌టీపీ నుంచి విజయమ్మ పోటీ చేయానున్నారని ప్రచారం జరుగుతుంది.