విజయ్ కాంత్ మరణ వార్త విని అభిమానులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. అనారోగ్య కారణాలతో కొన్నేళ్లుగా ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు విజయ్ కాంత్. కదలలేని పరిస్థితుల్లో ఉన్న కెప్టెన్ సినిమాలకు ఎప్పుడో దూరం అయ్యారు. ఇక కొన్నాళ్లుగా పార్టీ సమావేశాలకు కూడా దూరంగా ఉంటున్నారు. కిడ్నీ మార్పిడి, మధుమేహం, ఇలాఅనేక అనారోగ్య సమస్యలకు ఆయన ఎప్పటికప్పుడు హాస్పిటల్ కు వెళ్ళి ట్రీట్మెంట్ తో పాటు..పరీక్షలు కూడా చేయించుకుంటూ వస్తున్నారు.
ఇంట్లోనే అది కూడా వీల్ చేైర్ సహాయంతో తిరుగుతూ.. విశ్రాంతి తీసుకుంటున్నారు విజయకాంత్. తమిళంలో పెద్ద ఎత్తున అభిమానులను సంపాదించుకున్న విజయకాంత్‌కు నల్ల ఎంజీఆర్ అన్న పేరు ఉంది. అభిమానులు ఆయనను కెప్టెన్ అని పిల్చుకుంటారు. 1952 ఆగస్టు 25న జన్మించిన విజయకాంత్ పోలీసు పాత్రలలో మంచి పేరు తెచ్చుకున్నారు.
సినీ నటుడుగా రాణిస్తూనే డీఎండీకే పార్టీని స్థాపించారు. అసెంబ్లీకి ఎన్నికయ్యారు కూడా. 2011 నుంచి 2016 వరకు ప్రతిపక్ష నాయకుడిగా పని చేశారు. విరుధాచలం, రిషివండియం నియోజకవర్గాల నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు, రాజకీయనాయకులు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.