చెన్నైలోని నివాసంలో ఉరేసుకుని ఆమె బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటనతో ఆయన కుటుంబం గత రెండు రోజులుగా శోకసంద్రంలోనే ఉంది. ఈ క్రమంలో విజయ్ ఆంటోనీ ఎక్స్(ట్విటర్) వేదికగా తాజాగా స్పందించారు. అయితే కోలీవుడ్ హీరో అండ్ డైరెక్టర్ విజయ్ ఆంటోనీ కూతురు ఆత్మహత్య సినీ ఇండస్ట్రీని షాక్‌కు గురిచేసింది.మంగళవారం (సెప్టెంబర్ 19) తెల్లవారుజామున చెన్నైలోని తన ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది మీరా ఆంటోని. కుటుంబ సభ్యులు గమనించి ఆస్పత్రికి తీసుకెళ్లినా అప్పటికే ఆమె చనిపోయినట్లు చెప్పారు. దీంతో విజయ్ ఆంటోని కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
పలువురు సినీ ప్రముఖులు విజయ్ కూతురు మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మీరా ఆత్మకు శాంతి కలగాలంటూ ప్రార్థిస్తున్నారు. మరోవైపు తాజాగా మీరా ఆంటోని మృతదేహానికి పోస్ట్‌మార్టం కూడా పూర్తయ్యింది. చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో మీరా శవ పరీక్ష జరగ్గా… ఆమెది ఆత్మహత్యే అంటూ రిపోర్టులో స్పష్టం చేశారు వైద్యులు. ఇక విజయ్ ఆంటోనీ కూతురు మృతదేహానికి అంత్యక్రియలను రేపు నిర్వహించనున్నట్లు సమాచారం. మరోవైపు మీరా డిప్రెషన్‌తో బాధపడుతోందని.. గత కొన్ని రోజులుగా మందులు వాడుతుందని పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో తేలింది.
దీంతో పాటు మీరా చదువుతున్న చర్చి పార్క్ స్కూల్‌తో పాటు తన స్నేహితులను పోలీసులు విచారిస్తున్నారు. అలాగే మీరా ఫోన్ కాల్ రికార్డ్స్‌ను కూడా పరిశీలిస్తున్నారు. ఆమె చివరిగా ఎవరితో మాట్లాడింది? ఏం మాట్లాడింది? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. మరోవైపు విజయ్ ఆంటోనీ కూతురు ఆత్మహత్యతో తమిళ సినీ పరిశ్రమ షాక్‌లో మునిగిపోయింది. పలువురు సినీ ప్రముఖులు విజయ్‌కు ఫోన్ చేసి ధైర్యం చెబుతున్నారు. విశాల్, రాధికా శరత్‌కుమార్, జయం రవి, కస్తూరిశంకర్, రాఘవ లారెన్స్, లోకేష్ కనగరాజ్, జీవీ ప్రకాష్ కుమార్, పార్తీబన్ తదితర సినీ ప్రముఖులు విజయ్ కుటుంబ సభ్యులకు సోషల్ మీడియా వేదికగా ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మ్యూజిక్ కంపోజర్‌గా, ప్లేబ్యాక్ సింగర్‌గా, హీరోగా, డైరెక్టర్‌గా, లిరిసిస్ట్‌గా, ఎడిటర్‌గా.. ఇలా తన బహుముఖ ప్రజ్ఞతో సినీ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు విజయ్ ఆంటోనీ. బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా చేరువయ్యాడు. ఇటీవలే దీనికి సీక్వెల్ గా వచ్చిన బిచ్చగాడు 2 సినిమా కూడా సూపర్‌హిట్‌గా నిలిచింది.