విజయ్ కాంత్ తమిళనాడులో దేశీయ ముర్పొక్కు ద్రవిడ కఝగం పార్టీ చైర్మన్‌గా వ్యవహరించాడు. విజయ్ కాంత్ విరుధచలం, రిషివేందియం శాసనసభ నియోజక వర్గాల నుండి రెండు సార్లు శాసనసభ్యునిగా ఎన్నికయ్యాడు. 2015లో దేశీయ ముర్పోక్కు ద్రవిడ కజగం రాజకీయ పార్టీ వ్యవస్థాపించాడు. ఆ పార్టీకి అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి అతనే. ఇక విజయ్ కాంత్ పూర్తి పేరు.. విజయరాజ్ అలగర్‌స్వామి 1952 ఆగస్టు 25లో జన్మించారు.
అయితే తమిళ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ నటుడు విజయ్ కాంత్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. ఎన్నో యాక్షన్ చిత్రాల్లో నటించి మాస్ ప్రేక్షకులను మెప్పించారు. 1979 లో ఇనిక్కుం ఇలామై సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన విజయ్ కాంత్ ఎన్నో వైవిధ్యభరిత చిత్రాల్లో నటించారు. ఆయన ఎక్కువగా డ్యూయెల్ రోల్, పవర్ ఫుల్ పోలీస్ పాత్రల్లో నటించి మెప్పించారు. నటుడిగా మంచి ఫామ్ లో ఉండగానే రాజకీయాల్లో కి అడుగు పెట్టారు.
సొంతంగగా దేశీయ ముర్పొక్కు ద్రావిడ కళగం (డి.ఎం.డి.కె) పార్టీని స్థాపించి రాజకీయంగా తనదై మార్క్ చాటుకున్నారు. గత కొంత కాలంగా ఆయన తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. మంగళవారం మరోసారి ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ కన్నమూశారు.